Tourist Places in Hyderabad : సరికొత్తగా ముస్తాబైన హైదరాబాద్.. వీటిని చూడటం అస్సలు మిస్సవ్వద్దు
Updated: May 15, 2023, 12:13 PM |
Published: May 15, 2023, 12:13 PM
Published: May 15, 2023, 12:13 PM

Tourist Places in Hyderabad : కరోనా భయాల నుంచి తేరుకున్న తరుణంలో ఆతిథ్య రంగం తిరిగి పూర్వ స్థాయికి చేరుకుంటోంది. గతేడాది స్థాయిలోనే ఈ సంవత్సర ఆరంభం ఆశాజనకంగా ఉండటంతో హైదరాబాద్‌ను సందర్శించేందుకు పర్యాటకులు ఉత్సుకత చూపుతున్నారు. ఈక్రమంలోనే నగరంలోని వివిధ ప్రాంతాలను చుట్టేస్తున్నారు.

1/ 9
Tourist Places in Hyderabad : కరోనా ప్రభావం తగ్గడంతో చాలామంది కుటుంబ సమేతంగా పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. మక్కామసీదు, గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియంతో పాటు.. పర్యాటక స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీ, నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్, లుంబినీ, ఎన్టీఆర్ పార్క్, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, సచివాలయం ఇలా అనేక ప్రాంతాలకు పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు. మరోవైపు భారత్ జీ20కి నాయకత్వం వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఏడాది పాటు వాటి సదస్సులు దేశంలోని వేర్వేరు నగరాలతో పాటు హైదరాబాద్‌లోనూ నిర్వహించనున్నారు. 2022 సంవత్సరంలో పెద్ద ఎత్తున దేశ, విదేశీ పర్యాటకులు నగరాన్ని సందర్శించారు. ఇదే సందడి 2023లోనూ కన్పిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కొన్ని నెలల ముందు నుంచే హడావుడి మొదలయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా హైదరాబాద్‌కు వచ్చే రెండు జాతీయ పార్టీల నాయకులు, పరిశీలకులు, సర్వే సంస్థలతో ఈసారి అతిథ్య రంగానికి కలిసి రానుందనే అంచనాలు ఉన్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల్లో ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. ఈ కారణంగా ఐటీ కారిడార్‌లో అతిథ్య రంగం రికవరీ నెమ్మదిగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Loading...