ఇంట్లోనే ఆకట్టుకునేలా అవుట్డోర్ బాల్కనీలు
Published on: Jan 21, 2023, 1:16 PM IST |
Updated on: Jan 21, 2023, 1:16 PM IST
Updated on: Jan 21, 2023, 1:16 PM IST

Balcony Decorations తెలంగాణలోని హైదరాబాద్ మహా నగరంలో భారీ ఎత్తున ఆకాశహర్మ్యాల నిర్మాణాలు రావడానికి కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందన ఉండటమే కారణం. అంతఎత్తున ఉంటూ నగరం మొత్తం చూడొచ్చు అనే భావన ఎక్కువ మందిది. ఒకటో అంతస్తులో ఉంటే నగరం మొత్తం చూడలేకపోవచ్చు కానీ కాలనీని, చుట్టుపక్కల పరిసరాలను చూడొచ్చు. ఒకటో అంతస్తులో ఉన్నా.. 50వ అంతస్తులో ఉన్నా చుట్టుపక్కల ప్రపంచాన్ని చూడాలంటే బాల్కనీయే ఆధారం. ఇంట్లో ఉంటే ఎక్కువ సమయం బాల్కనీలో గడిపేందుకు ఇష్టపడుతుండటంతో పెద్ద బాల్కనీలు ఉన్న ఇళ్లవైపు కొనుగోలుదారులు చూస్తున్నారు.
పార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో ఇటీవల వరకు బాల్కనీని ఏదో ఒక పడక గదిలో సర్దేవారు. పెద్ద గదికి చిన్న బాల్కనీ ఇచ్చేవారు. 30 చదరపు అడుగులు కూడా ఉండేది కాదు. సౌకర్యంగా లేక దీన్ని చాలామంది స్టోర్ రూమ్‌గా మార్చేవారు. హాల్లో బాల్కనీ ఇచ్చినా నాలుగు అడుగుల పొడువు మాత్రమే ఉండేది. దీంతో బాల్కనీని బట్టలు ఆరేయడానికి, కొందరు పూలకుండీలతో పచ్చదనం పెంచుకోవడానికి మాత్రమే వినియోగించేవారు. భద్రత కోసం చుట్టూ గ్రిల్స్‌తో మూసేసేవారు. కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలు మారడంతో ఇటీవల అపార్ట్మెంట్లలో పెద్ద బాల్కనీలను ఇస్తున్నారు.
ఒక గది అంత విశాలంతో వీటిని నిర్మిస్తున్నారు. 130 నుంచి 150 చదరపు అడుగుల విస్తీర్ణం కేటాయిస్తున్నారు. అక్కడే ఊయల వేసుకుని ఊగుతూ ప్రకృతిని ఆస్వాదించేలా.. ఒకమూలకు నచ్చిన మొక్కలను పెంచుకునేలా.. ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగించేలా.. రోజులో ఎక్కువ సమయం గడిపేందుకు అనుకూలంగా బాల్కనీలను కడుతున్నారు. 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన మూడు పడగ గదుల ఫ్లాట్‌లో కార్పెట్ ఏరియా 1250 చదరపు అడుగులు వస్తే.. కామన్ ఏరియా 470 చదరపు అడుగులు పోతుంది. గోడలు గట్రా 140 చదరపు అడుగులు పోతే.. మరో 140 చదరపు అడుగులు బాల్కనీకి కేటాయిస్తున్నారు. అంటే ఇంటి లోపల విస్తీర్ణంలో పదిశాతం కంటే ఎక్కువే బాల్కనీకి కేటాయిస్తున్నారు.
1/ 17
Balcony Decorations

Loading...