సల్మాన్ ఖాన్ కార్ కలెక్షన్ ఆడి నుంచి బెంజ్ దాకా
Updated on: Jan 26, 2023, 11:07 AM IST

బాలీవుడ్ సుల్తాన్ సల్లూ భాయ్ స్టైల్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాడు. అందుకే ఆయన డైలీ లైఫ్ కూడా లగ్జరీగా సాగిపోతూ ఉంటుంది. లగ్జరీకి సింబల్‌గా చెప్పుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేవి కార్లే. మరి సల్మాన్ ఖాన్ వద్ద ఎన్ని కార్లు ఉన్నాయి. ఎలాంటి బ్రాండ్స్ ఉన్నాయో మీకు తెలుసా. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఇక సినిమాల గురించి చూస్తే సల్మాన్ దూసుకెళ్తున్నారు. ఒకవైపు తన మూవీస్ చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ ప్లే చేస్తున్నారు సల్మాన్. నిన్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపిన సల్లూ భాయ్ తాజాగా షారుక్ పఠాన్ మూవీలో కనిపించి కిక్కిచ్చారు. ఈ సినిమాలో సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సోలో మూవీస్ గురించి చూస్తో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీ శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళే విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ మీద సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తొలుత ఈ చిత్రానికి కభీ ఈద్ కభీ దివాళి అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత కిసీ కా భాయ్ కిసీ కా జాన్ గా మార్చారు. దీంతోపాటు టైగర్ 3 చేస్తున్నాడు. టైగర్ సిరీస్‌లో రాబోతున్న మూడో సీక్వెల్ ఇది.
