NRI TDP Cycle Rally in Adelaide: ఆస్ట్రేలియాలో రెపరెపలాడిని తెలుగుదేశం జెండా.. జయహో ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తిన అడిలైడ్
Updated: May 18, 2023, 9:29 AM |
Published: May 18, 2023, 9:29 AM
Published: May 18, 2023, 9:29 AM

NTR Centenary Celebrations at Adelaide in Australia: యుగపురుషుడు, విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో స్థానిక NRI టీడీపీ సెల్ ఆధ్వర్యంలో వినూత్న సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మే 28న అడిలైడ్ నగరంలో నిర్వహిస్తున్న వేడుకల నేపథ్యంలో తెలుగుదేశం జెండాలు చేతబూని, ఎన్టీఆర్, టీడీపీ పాటలతో జోహార్ ఎన్టీఆర్.. జై తెలుగుదేశం, జై బాలయ్య నినాదాలతో నగర వీధులను హోరెత్తించారు.

1/ 10
తెలుగుజాతి పౌరుషాన్ని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పిన మహనీయుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరాముని శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో స్థానిక NRI టీడీపీ సెల్ ఆధ్వర్యంలో వినూత్నమైన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రెండు గంటలు పైగా అడిలైడ్ నగర వీధుల్లో ఉత్సాహంగా సైకిల్ని తొక్కుతూ.. ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపు ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ విశిష్టను చాటి చెబుతూ.. తెలుగుదేశం జెండాలు చేతబూని, ఎన్టీఆర్, టీడీపీ పాటలతో జోహార్ ఎన్టీఆర్.. జై తెలుగుదేశం, జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. స్థానికులు (ఆస్ట్రేలియన్స్ )సైతం ర్యాలీగా వెళ్తున్న తెలుగుదేశం అభిమానులను చూస్తూ.. ఉత్సాహంగా చేతులు ఊపుతూ, తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా పలువురు NRI టీడీపీ సభ్యులు మాట్లాడుతూ.. మే 28న అడిలైడ్ నగరంలో శక పురుషుడికి శత వసంతాల పండుగ ఘనంగా నిర్వహించబోతున్నామన్నారు. అందులో భాగంగానే.. ఈ వినూత్నమైన సైకిల్ని తొక్కుతూ శత జయంతి పండుగ ముఖ్య ఉద్దేశాన్ని తెలపడమే కాకుండా ఎన్టీఆర్ విశిష్టత, ఖ్యాతి స్థానికులకు తెలియ చెప్పాలనే సంకల్పంతో నగరంలో ర్యాలీ చేపట్టాం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి మే 28న నందమూరి కుటుంబసభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, చిన్న కుమార్తె తేజస్విని పాల్గొంటున్నారు అని కమిటీ సభ్యులు తెలిపారు.

Loading...