సినీ నటుల నడుమ ఉత్సాహంగా వైజాగ్ నేవీ మారథాన్
Updated: Nov 13, 2022, 12:52 PM |
Published: Nov 13, 2022, 12:52 PM
Published: Nov 13, 2022, 12:52 PM

విశాఖ సాగరతీరంలో వైజాగ్ నేవీ మారథాన్ - 22 ఉత్సాహంగా సాగింది. రెండేళ్ల విరామం తర్వాత నిర్వహించిన మారథాన్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు నూతన ఉత్సాహంతో వేల సంఖ్యలో రన్నర్లు పాల్గొన్నారు. ఈ సూదూరమైన పరుగుల పోటిని నటుడు అడవి శేషు ప్రారంభించారు. నాలుగు కేటగిరిల్లో జరిగిన ఈ మారథాన్లోఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే, 5కే కేటగిరీల్లో నిర్వహించారు. ఇందులో పాల్గొనడానికి 18 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మారథాన్ డైరెక్టర్ నన్నపనేని మురళి తెలిపారు. భారీ సంఖ్యలో నేవీ ఉద్యోగులతో పాటు చిన్నా, పెద్దా, చివరికి దివ్యాంగులు కూడా మేము సైతం అంటూ.. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని నేవీ ఉన్నతాధికారి నాయర్ తెలిపారు. మారథన్లో పాల్గొని పూర్తి చేసుకున్న వారికి నిర్వాహకులు పతకాలు అందజేశారు.

1/ 17
వైజాగ్ నేవీ మారథాన్ - 22

Loading...