నిమ్మకూరులో నందమూరి బాలకృష్ణ సందడి
Updated: Mar 16, 2023, 8:08 PM |
Published: Mar 16, 2023, 7:31 PM
Published: Mar 16, 2023, 7:31 PM

ఎప్పుడూ సినిమాలు, రాజకీయాలతో బిజీబిజీగా ఉండే తెలుగు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు సందడి చేశారు. కృష్ణా జిల్లాలోని తన తండ్రి నందమూరి తారక రామారావు స్వగ్రామమైన నిమ్మకూరుకు వచ్చారు. గ్రామంలోని ప్రతి ఒక్కరినీ పలకరించారు. గ్రామస్థులు, విద్యార్థులతో ముచ్చటించారు. గ్రామస్థులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. తనకు గ్రామంతో ఉన్న సంబంధాన్ని గ్రామస్థులతో బాలకృష్ణ నెమరు వేసుకున్నారు. అనంతరం ఏపీఈఆర్ జేసీ కళాశాలలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులతో బాలకృష్ణ ముచ్చటించారు.

1/ 9
ఎప్పుడూ సినిమాలు, రాజకీయాలతో బిజీబిజీగా ఉండే తెలుగు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు సందడి చేశారు. కృష్ణా జిల్లాలోని తన తండ్రి నందమూరి తారక రామారావు స్వగ్రామమైన నిమ్మకూరుకు వచ్చారు. గ్రామంలోని ప్రతి ఒక్కరినీ పలకరించారు. గ్రామస్థులు, విద్యార్థులతో ముచ్చటించారు. గ్రామస్థులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. తనకు గ్రామంతో ఉన్న సంబంధాన్ని గ్రామస్థులతో బాలకృష్ణ నెమరు వేసుకున్నారు. అనంతరం ఏపీఈఆర్ జేసీ కళాశాలలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులతో బాలకృష్ణ ముచ్చటించారు. ఎన్టీఆర్ కట్టిన కళాశాలలో వసతులు ఎలా ఉన్నాయని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణను చూసిన విద్యార్థులు ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. కళాశాలలో అన్నీ వసతులు బాగున్నాయని విద్యార్థులు బాలకృష్ణకు తెలిపారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు ఎలా రాస్తున్నారంటూ బాలకృష్ణ.. ఇంటర్ విద్యార్థుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఊరి పెద్దలతో సమావేశమై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వివిధ సమస్యలపై గ్రామ పెద్దలతో మాట్లాడారు.

Loading...