రాష్ట్రంలో నాగుల చవితి వేడుకలు - కిక్కిరిసిన ఆలయాలు
Updated: Nov 17, 2023, 5:25 PM |
Published: Nov 17, 2023, 5:25 PM
Published: Nov 17, 2023, 5:25 PM
Follow Us 

Nagula Chavithi Celebrations: రాష్ట్రవ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పలు ఆలయాలకు, పుట్టల వద్దకు చేరుకుని విశేష పూజలు నిర్వహించారు. పుట్టలకు పాలు, గుడ్లు సమర్పించి మహిళలు భక్తిని చాటుకున్నారు.

1/ 17
రాష్ట్రంలో నాగుల చవితి ఘనంగా నిర్వహించుకున్నారు. నాగుల చవితి రోజు నాగదేవతను, నాగేంద్రుడ్ని పూజిస్తే.. సర్పదోషం పోతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పుట్టలకు పాలు పోసి పూజిస్తే సర్వదోషాలు పోతాయని నమ్మకం. అంతేకాకుండా సంతానప్రాప్తి కలుగుతుందని కూడా భక్తులు నమ్ముతారు. అందుకోసం వేకువజాము నుంచే పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు జిల్లాలోని ఆలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. కుటుంబ సభ్యులతో కలిసి నాగేంద్రుడ్ని పూజించారు. వారికి అందుబాటులో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల పూజలతో ఆలయాలు కోలాహలంగా మారాయి. నాగుల చవితి సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి.. నాగేంద్రునికి మొక్కులు చెల్లించుకున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు ఉపవాసాలు ఉన్నారు. ఉపవాసం ద్వారా స్వామి కృప కటాక్షలు తమపై ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. తమకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ స్వామి వారిని కోరుకుంటూ నాగుల చవితి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
Loading...
Loading...
Loading...