పాఠశాలలో 'జంగిల్ డే' - అడవిలో అడుగుపెట్టిన చిన్నారులు, చుట్టూ వన్యప్రాణులు
Updated: Nov 21, 2023, 4:35 PM |
Published: Nov 21, 2023, 4:35 PM
Published: Nov 21, 2023, 4:35 PM
Follow Us 

Jungle Day Celebrations at Bobbili School: అది ఓ పాఠశాల కానీ.. అటవీ ప్రాంతాన్ని తలపించే విధంగా అలంకరించారు. అటవీ దినోత్సవం పురస్కరించుకొని రకరకాల నమూనాలను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలోకి అడుగు పెడితే ఇది అటవీ ప్రాంతమా? పాఠశాల ప్రాంగణమా?అని అనిపించక మానదు. చుట్టూ రకరకాల వన్యప్రాణులు, పాములు నివసించే ఆవాసాలు, గుహలో సెలయేర్లు.. ఇలా పాఠశాలలో అన్ని రకాల ఆకృతులను ఏర్పాటు చేయడంతో సందర్శకులు ఆకట్టుకుందీ.. విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి పట్టణంలోని శ్వేతా చలపతి సంస్థానం ఇంగ్లీష్ మీడియం పాఠశాల. ఆ చిత్రాలపై మీరూ ఓ లుక్కేయండి..

1/ 23
Jungle Day Celebrations at Bobbili School: అది ఓ పాఠశాల కానీ.. అటవీ ప్రాంతాన్ని తలపించే విధంగా అలంకరించారు. అటవీ దినోత్సవం పురస్కరించుకొని రకరకాల నమూనాలను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలోకి అడుగు పెడితే ఇది అటవీ ప్రాంతమా? పాఠశాల ప్రాంగణమా?అని అనిపించక మానదు. చుట్టూ రకరకాల వన్యప్రాణులు, పాములు నివసించే ఆవాసాలు, గుహలో సెలయేర్లు.. ఇలా పాఠశాలలో అన్ని రకాల ఆకృతులను ఏర్పాటు చేయడంతో సందర్శకులు ఆకట్టుకుందీ.. విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి పట్టణంలోని శ్వేతా చలపతి సంస్థానం ఇంగ్లీష్ మీడియం పాఠశాల. స్కూల్లోని 350 మంది కిండర్ గార్డెన్ విద్యార్థుల్లో.. 229 విద్యార్థులు పులి, సింహం, ఏనుగు, జిరాఫీ, ఒంటె, కోతి, నెమలి మొదలైన వాటి వేషాలు ధరించి.. అటవీ ప్రాంతాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ ప్రదర్శనలో చిన్నారులు.. వన్యప్రాణుల జీవనశైలిని ఆంగ్లంలో వర్ణిస్తూ.. అడవుల ప్రాముఖ్యతను వివరించడం మరింత ఆకట్టుకుంది. పాఠశాలలో అడుగుపడితే అటవీ ప్రాంతంలో ఉన్నామా అనిపించేలా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో పట్టణ వాసులే కాకుండా పలు ప్రాంతాలకు చెందినవారంతా పాఠశాలలోని అటవీ సుందర దృశ్యాలను తిలకించారు.
Loading...
Loading...
Loading...