INTERNATIONAL YOGA DAY-2022 : జీవన'యోగం'.. ఆరోగ్య ప్రదాయం
Published on: Jun 21, 2022, 3:12 PM IST |
Updated on: Jun 21, 2022, 3:12 PM IST
Updated on: Jun 21, 2022, 3:12 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. యోగా ప్రాచీనమైనదే అయినా.. భారతీయ సంస్కృతికి ప్రతీక అని వెంకయ్య ఉద్ఘాటించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. నగరంలోని వివిధ పాఠశాలలో యోగా డే వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకో యోగాతో కలిగే ప్రయోజనాలను ఉపాధ్యాయులు వివరించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని అపోలో ఆస్పత్రి వైద్యులు సూచించారు.
1/ 20

Loading...