'నాటు నాటు' సాంగ్.. ఈ ఆసక్తికర విషయాలను మీరు గమనించారా?
Published: Mar 13, 2023, 10:35 AM

లాస్ ఏంజిల్స్‌లో వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో భారతీయ సినిమా గెలుపుబావుటా ఎగురవేసింది. భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన పర్వం.. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన 'ఆస్కార్' అవార్డు ను 'ఆర్ఆర్ఆర్' చిత్రం సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ 'నాటు నాటు' సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు గెలుపొందిన 'నాటు నాటు' పాట గురించి చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నాటునాటును ఉక్రెయిన్‌లోని జెలెన్స్కీ ఇంటి వద్ద ఎందుకు చిత్రీకరించాల్సి వచ్చిందో వానిటీ ఫెయిర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పాట చిత్రీకరణకు సంబంధించి ఎన్నో తెలియని అంశాలను రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. నాటు నాటు పాటను తొలుత భారతదేశంలోని చిత్రీకరించాలని దర్శకుడు రాజమౌళి భావించారు. ఆ సమయంలో దేశంలో వర్షాకాలం కావడంతో ఇతర దేశాల్లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. మంచి లొకేషన్ గురించి వెతుకుతున్న సమయంలో ఉక్రెయిన్‌లోని ఓ భవనాన్ని చూసి అక్కడే చిత్రీకరించాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు. అంతా ఓకే అనుకొని ఉక్రెయిన్ వెళ్లి షూటింగ్ చేసేద్దాం అనుకుంటుండగా.. అది ఉక్రెయిన్ అధ్యక్షుడి భవనం అని చిత్ర బృందానికి తెలిసింది. అనుమతులు దొరకవని అనుకుంటుండగా.. అక్కడి అధికారులు.. 'నో ప్రాబ్లెమ్' చేసుకోండి అని చెప్పినట్లు రాజమౌళి తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే?

