ఫస్ట్ మూవీతో రచ్చ చేశారు కనిపించకుండా పోయారు
Published: Jan 28, 2023, 12:43 PM

చినుకులా మొదలై తుఫానులా మారే హీరోయిన్లు కొందరుంటారు. కానీ తొలి అడుగుతోనే తుఫానులా ప్రభంజనం సృష్టించి ఆ తర్వాత తెరమరుగైపోయే వారు మరికొందరు ఉంటారు. అలాంటి వారు టాలీవుడ్లో చాలా మందే ఉన్నారు. ఫస్ట్ మూవీతో అందరినీ ఆకట్టుకొని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారి గురించి ఈ స్టోరీలో చూద్దాం. నువ్వే కావాలి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ స్థాయిలో హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ రిచా పల్లోడ్. ఆ మూవీలో రిచా పోషించిన పాత్ర ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలని ప్రతి యువకుడూ కోరుకున్నాడంటే అతిశయోక్తి కాదు. అంతలా మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత అన్నీ అపజయాలనే ఫేస్ చేసింది. త్వరగానే ఇండస్ట్రీని వదిలి పెట్టాల్సి వచ్చింది. ఈ లిస్టులోని మరో హీరోయిన్ అన్షు. మన్మథుడు మూవీలో అన్షు ఒద్దికైన అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. తన క్యూట్ క్యారెక్టర్‌తో యూత్‌ను ఫుల్లుగా అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు సినిమాలకు దూరమైపోయింది. ఈ కేటగిరీలోని మరో బ్యూటీ అనురాధా మెహతా. ఆర్య సినిమాలో హీరోయిన్. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన సెన్షేషన్ అంతా ఇంతా కాదు. ఆర్య చిత్రానికి అనురాధా బ్యూటీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కానీ ఈ సక్సెస్‌ను అను నిలుపుకోలేకపోయింది. ఫెయిల్యూర్స్ వెంటాడడంతో ఇండస్ట్రీని వీడక తప్పలేదు. ఇంకా ఈ జాబితాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు.

