Rain in Tirumala: తిరుమలలో ఉరుములు, మెరుపులతో వర్షం
Updated: May 18, 2023, 7:53 PM |
Published: May 18, 2023, 7:53 PM
Published: May 18, 2023, 7:53 PM

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో... పెను గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ క్రీడా మైదానం పైకప్పు రేకులు ఎగిరిపడి ధ్వంసమయ్యాయి. గంగమ్మ జాతర విద్యాత్ దీపాల నిర్మాణాలు నేలకూలాయి. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ధ్వంసం కావడంతో.. తీవ్ర నష్టం వాటిల్లింది. అటు తిరుమలలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. క్యూలైన్లలో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో కురిసిన వర్షంతో.. వాతావరణం కాస్త చల్లబడినా... ఈదురుగాలుల బీభత్సానికి వాటిల్లిన విధ్వంసం కారణంగా తీవ్ర అవస్థలు పడ్డారు.

1/ 16
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. తిరుమలలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఓ వైపు తిరుమలకు భారీ ఎత్తున భక్తులు రావడం.. మరోవైపు వర్షం కురవడంతో భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు సైతం అవస్థలు పడాల్సి వచ్చింది. పలుచోట్ల రోడ్లపై వర్షం నీరు నిలిచింది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో... పెను గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ క్రీడా మైదానం పైకప్పు రేకులు ఎగిరిపడి ధ్వంసమయ్యాయి. గంగమ్మ జాతర విద్యాత్ దీపాల నిర్మాణాలు నేలకూలాయి. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ధ్వంసం కావడంతో.. తీవ్ర నష్టం వాటిల్లింది. ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో కురిసిన వర్షంతో.. వాతావరణం కాస్త చల్లబడినా.. ఈదురుగాలుల బీభత్సానికి వాటిల్లిన విధ్వంసం కారణంగా భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.

Loading...