కశ్మీర్లో జీ20 సమావేశాలు.. భద్రత కట్టుదిట్టం.. దాల్ సరస్సులో మాక్‌డ్రిల్
Updated: May 21, 2023, 4:10 PM |
Published: May 21, 2023, 4:10 PM
Published: May 21, 2023, 4:10 PM
Follow Us 

G20 Meeting Kashmir Security : జమ్ముకశ్మీర్‌లో జీ20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అక్కడి భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. చొరబాట్లు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో పోలీసులు.. జీ20 సమావేశ వేదిక, విమానాశ్రయం, ఇతర ముఖ్య ప్రదేశాల్లో మోహరించారు. ప్రముఖ దాల్ సరస్సులో మాక్ డ్రిల్‌ను సైతం భద్రతా దళాలు నిర్వహించాయి.

1/ 17
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు జరగనున్న క్రమంలో అక్కడ భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల వెంట చొరబాట్లు, ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సైన్యం, పోలీసులు డేగ కళ్లతో నిరంతరం లోయను జల్లెడ పడుతున్నారు. మే 22, 23, 24 తేదీల్లో శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం ఇదే కావడం వల్ల అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చొరబాట్లు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో పోలీసులు.. జీ20 మూడు రోజుల సమావేశ వేదిక, విమానాశ్రయం, ఇతర ముఖ్య ప్రదేశాల్లో మోహరించారు. దాల్ సరస్సులో మాక్ డ్రిల్‌ను సైతం భద్రతా దళాలు నిర్వహించాయి. మే 22న ప్రారంభమయ్యే మూడు రోజుల సమావేశాల్లో పాల్గొనేందుకు విదేశీ అతిథులు ఆదివారం శ్రీనగర్‌కు చేరుకుంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా శ్రీనగర్‌లోని అనేక వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు.
Loading...
Loading...
Loading...