పేలుతున్న టపాసుల ధరలు - తగ్గేదేలే అంటున్న ప్రజలు
Updated: Nov 12, 2023, 2:10 PM |
Published: Nov 12, 2023, 2:10 PM
Published: Nov 12, 2023, 2:10 PM
Follow Us 

Diwali Crackers Rates in AP Today : యువత ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి.. ఇళ్లంతా దీపాల కాంతులతో నింపేస్తూ.. ఇంటిళ్లపాది టపాసులు కాలుస్తూ ఆనందంగా దీపావళి పండగను జరుపుకుంటారు. గతంలో పోలిస్తే ఈ ఏడాది దీపావళి సామగ్రి ధరలు పెరిగాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

1/ 15
Diwali Crackers Rates in AP Today : రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి పండగ సందడి తీసుకువచ్చింది. టపాసుల షాపులకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక గత సంవత్సరంతో పోలిస్తే టపాసుల ధరలు పెరగడంతో నిరుత్సాహం వ్యక్తం చేశారు. కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు ఇలా టపాసుల ధరలు కొండెక్కాయి. వారి పిల్లల మోహంలో ఆనందాన్ని చూడటానికి తల్లిదండ్రులు టపాసులు కొనేందుకు వెనుకాడటం లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో క్రాకర్ మార్కెట్లు చిన్న పిల్లల ముసి ముసి నవ్వులతో.. యువతి, యువకుల ఉత్సాహంతో నిండిపోయాయి. గతంతో పోల్చుకుంటే సుమారు 15 శాతం ధరలు పెరిగాయని.. జీఎస్టీ ఇతర కారణాలతో బాణసంచా ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. ఇదిలావుంటే టపాసులు అమ్ముకోవడానికి రెండు రోజులు మాత్రమే సమయం ఇవ్వడంపై వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరకు మూడు రోజులు దీపావళి సామగ్రి అమ్ముకోవడానికి అవకాశం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది వ్యాపారం బాగా జరుగుతుందని భావించినా.. ఆశించిన స్థాయిలో లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Loading...
Loading...
Loading...