ప్రారంభోత్సవానికి సిద్ధమైన తెలంగాణ సచివాలయం.. మీరు చూశారా
Published on: Jan 25, 2023, 11:43 AM IST |
Updated on: Jan 25, 2023, 11:43 AM IST
Updated on: Jan 25, 2023, 11:43 AM IST

CM KCR inspects New Secretariat Works నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. భవనం అంతా కలియతిరిగారు. పనుల పురోగతిపై ఆరా తీసిన సీఎం.. పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేదపండితులు సూచించిన ప్రకారం ఫిబ్రవరి 17న ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సచివాలయ భవనం ప్రారంభోత్సవం జరుగుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముందు వేదపండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్, డా.బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ తదితరులు హాజరవుతారని మంత్రి తెలిపారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత... సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
1/ 21
సచివాలయ ప్రాంగణంలో రెండు గంటలకు పైగా కేసీఆర్... పనుల గురించి ఇంజినీర్లను, అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.

Loading...