ప్రియాంక చోప్రా 'నెక్లెస్' రూ.204 కోట్లు.. ఊర్వశి రౌతేలాది రూ.274 కోట్లు.. సామ్‌ది ఎంతో గుర్తుందా?
Updated: May 23, 2023, 6:52 PM |
Published: May 23, 2023, 5:36 PM
Published: May 23, 2023, 5:36 PM
Follow Us 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా అదిరిపోయే మోడ్రన్ డ్రెస్సుల్లు ధరించి.. తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఆమె ధరించిన మొసలి నెక్లెస్ బాగా హైలైట్‌గా నిలిచింది. తాజాగా దాని ధర రూ.274కోట్లు అని ఆమె సోషల్‌మీడియా టీమ్ చెప్పి మైండ్ బ్లాక్ చేసింది. అయితే అంతకుముందు పలువురు భామలు కూడా భారీ రేంజ్లో అదిరిపోయే నెక్లెస్‌లు ధరించారు. దాని గురించే ఈ కథనం..

1/ 14
ప్రతి ఏటా సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఏదో ఒక అవార్డు ఫంక్షన్, ఫ్యాషన్ ప్రదర్శించే ఈవెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ వేదికలపై అందాల తారలు.. అందరి దృష్టిని ఆకర్షించేలా భిన్నమైన మోడ్రన్ ఔట్ఫిట్లలో మెరుస్తుంటారు. రెడ్ కార్పెట్‌పై తమ అందాల్ని ఆరబోస్తూ హోయలొలికిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఈవెంట్లతో వారు ధరించే డ్రెస్‌లతో పాటు మెడలో ధరించే నెక్లెస్‌లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒకరేమో పాము ఆకారంలో.. ఇంకొకరు మొసలి ఆకారంలో.. ఇలా రకరకాల డిజైన్లను ధరిస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఈ ఏడాది మెట్ గాలా వేడుకలోలో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా.. ప్రముఖ ఇటాలియన్ జ్యువెలరీ కంపెనీ బల్గరీ డిజైన్ చేసిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ధరించి ఆకట్టుకుంది. దాని ధర భారత కరెన్సీలో రూ.204 కోట్లకు పైగా ఉంటుందని వార్తలు వచ్చాయి. అంతకన్నా ముందు సిటాడెల్ ప్రమోషన్స్‌లో హీరోయిన్ సమంత ధరించిన నెక్లెస్, బ్రాస్లెట్ దాదాపు రూ.7కోట్ల వరకు ఉంటుందని ప్రచారం సాగింది. ఇక తాజాగా జరిగిన కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పింక్ కలర్ గౌన్‌లో క్రోకోడైల్ నెక్లెస్‌తో తళుక్కున మెరిసింది. ఇప్పుడు దాని ధర వివరాలు బయటకు వచ్చాయి. అది ఏకంగా రూ.250కోట్లకు పైమాటే అని తెలిసింది.
Loading...
Loading...
Loading...