చిన్న చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజవ్వనున్న మూవీస్ ఇవే!
Updated: May 22, 2023, 1:22 PM |
Published: May 22, 2023, 1:22 PM
Published: May 22, 2023, 1:22 PM
Follow Us 

వేసవిలో వరుస సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరించగలుగుతున్నాయి. ఈ క్రమంలో మే చివరి వారంలో థియేటర్‌ను చిన్న చిత్రాలే పలకరించనున్నాయి. అలాగే ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు క్యూ కడుతున్నాయి. అవేంటో ఓ సారి చూసేద్దామా..

1/ 16
వేసవిలో వరుస సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని జానర్స్ సినిమాలు రిలీజయ్యేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరించగలుగుతున్నాయి. కంటెంట్, గ్రాఫిక్స్ పరంగా కొన్ని సినిమాలు విన్నూత్నంగా ప్రయత్నించినప్పటికీ అవన్నీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే కొన్ని మాత్రం థియేటర్లలో నిరాశ పరిచి.. ఓటీటీల్లోకి వచ్చి ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మే చివరి వారంలో థియేటర్‌ను చిన్న చిత్రాలే పలకరించనున్నాయి. అలాగే ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు క్యూ కడుతున్నాయి. మరికొన్ని అయితే ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా సీజన్లతో అలరించి మరో కొత్త సీజన్‌తో అభిమానుల ముందుకొస్తున్నాయి. వీటితో పాటు హాలీవుడ్,బాలీవుడ్‌కు చెందిన సినిమాలు కూడా ప్రముఖ ఓటీటీల్లోకి రానున్నాయి. ఈ కక్రమంలో ఈ వారం అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే మూవీస్ ఏంటి? ఏయే ఓటీటీ వేదికల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతాయో అని ఎక్సైటింగ్‌గా ఉన్నారా? మీరు కూడా ఓ సారి చూసేయండి మరి..
Loading...
Loading...
Loading...