పిచ్చెక్కిస్తున్న పిల్లి కళ్ల సుందరి.. నెటిజన్లు ఫిదా!
Published: Mar 10, 2023, 7:03 AM

టాలీవుడ్లోకి రోజుకో కొత్త అందం ఎంట్రీ ఇస్తూ అందరిని కనువిందు చేస్తోంది. కొందరి సినిమాలు హిట్ కొట్టి ఆ హీరోయిన్లకు ఓవర్ నైట్ స్టార్డం తెచ్చిపెడితే.. కొందరికి మాత్రం తొలి సినిమా అంత కలిసి రాకపోవచ్చు. అలా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ అందులో నటించిన తారలు ప్రేక్షకుల మదిని దోచేసి వారికి అభిమాన తారలైపోతుంటారు. ముంబయికి చెందిన ఊర్వీ సింగ్ కూడా ఆ కోవకు చెందిందే. హిందీలో 'కోటా ఫ్యాక్టరీ', 'క్రష్డ్' వెబ్‌సిరీస్‌లలో నటించి అలరించిన ఈ పిల్లి కళ్ల పాప తెలుగులో ఇటీవలే రిలీజైన 'మిస్టర్ కింగ్' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ ఈ నిషా కళ్ల ఊర్వీకి మాత్రం అందరూ కనెక్ట్ అయిపోయారు. ఇక అభిమానులు ఆమె గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అంతే కాకుండా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను లైక్,కామెంట్ల వర్షంలో తడిపేస్తున్నారు. ఆ ఫొటోలను మీరు కూడా ఓ సారి లుక్కేయండి మరి..

