నిన్న టీవీ యాక్టర్స్ ఇవాళ వెండితెర సూపర్ స్టార్స్
Published on: Jan 23, 2023, 3:14 PM IST |
Updated on: Jan 23, 2023, 3:14 PM IST
Updated on: Jan 23, 2023, 3:14 PM IST

టీవీ నటులు అంటే థర్డ్ గ్రేడ్ యాక్టర్స్ అన్న ఫీలింగ్‌లో ఉంటారు చాలా మంది. వెండితైరపై వెలిగిపోయే హీరో హీరోయిన్లను A1 నటులుగా భావించే జనాలు సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులను సెకండరీ గ్రేడ్ యాక్టర్లుగా ఫీలవుతుంటారు. బిజినెస్ పరంగా స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీ స్థాయి కూడా అందుకు కారణమై ఉండొచ్చు. సినిమాతో కంపేర్ చేసినప్పుడు టీవీ రంగంలో ప్రొడక్షన్ మొదలు రెమ్యునరేషన్ దాకా అన్నీ తక్కువగానే ఉంటాయి. కానీ ఇక్కడ నటించే నటులలో టాలెంట్ తక్కువగా ఉంటుందని అనుకుంటే మాత్రం ట్రైలర్ చూసి సినిమా రివ్యూ రాయడమే అవుతుంది. టెలివిజన్ రంగంలో ఉన్నవారికి సైతం అపారమైన టాలెంట్ ఉంటుంది. కావాల్సినంత నటనా చాతుర్యం ఉంటుంది. కానీ దాన్ని ప్రదర్శించే అవకాశం చాలా మందికి దక్కదు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాక టీవీ రంగంలో మిగిలిపోతుంటారు చాలా మంది. కానీ మరికొందరు సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతారు. దానికోసం అహర్నిశలూ కృషి చేస్తారు. రాత్రి పగలూ కష్టపడతారు. ఫైనల్‌గా టార్గెట్‌ను రీచ్ అవుతారు. ఆ విధంగా టీవిలో కెరియర్ స్టార్ట్ చేసి ఇవాళ వెండితెరపై సూపర్ స్టార్లుగా వెలిపోతున్న నటులు భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరి ఆ తారలు ఎవరు వాళ్లు ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
1/ 21
list who started career as tv actors

Loading...