బన్నీ పక్కన సాయి పల్లవి.. పుష్ప 2కు ఓకే చెప్పిన రౌడీ బేబీ!
Published: Mar 8, 2023, 11:35 AM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ తెచ్చి పెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. గతేడాది విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడమే కాకుండా వరల్డ్ లెవెల్లో గుర్తింపు పొందింది. దీంతో అల్లు అర్జున్ రేంజ్ ఇంకాస్త పెరిగింది. ఐకాన్ స్టార్ కాస్త పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు. ఇక అల్లు అర్జున్‌తో పాటు సినిమాలోని ప్రతి వ్యక్తి పేరు దేశమంతటా మారుమోగిపోయింది. రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్ ఇలా అందరి పేర్లు అభిమానుల నోట నానిపోయాయి. ఇక డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప అంటే ఫైర్', అలాగే 'తగ్గేదే లే' అనే డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సీక్వెల్ షూట్ నడుస్తోంది. ఇప్పటికే అందులోని కీలకమైన నటీనటులంతా షూట్లో బిజీ అయిపోయారు. అయితే సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో నటి సాయి పల్లవి కూడా ఓ రోల్ చేస్తోందట. అయితే ఈ విషయాన్ని సినిమా యూనిట్ అఫిషియల్‌గా చెప్పనప్పటికీ ఈ వార్త నిజమైతే ఎంత బాగుంటుందో అంటూ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

