రణ్వీర్ దీపికలకు ఉన్న కార్ల విలువ అన్ని కోట్ల రూపాయలా
Published on: Jan 22, 2023, 5:56 PM IST |
Updated on: Jan 22, 2023, 7:44 PM IST
Updated on: Jan 22, 2023, 7:44 PM IST

బాలీవుడ్లో పాపులర్ కపుల్‌గా వెలుగొందుతున్న జంటల్లో రణ్వీర్ సింగ్ దీపికా పదుకొణె జంట ముందు వరసలో ఉంటుంది. స్టార్ హీరోగా రణ్వీర్ దూసుకెళ్తుంటే అగ్ర హీరోయిన్గా సత్తా చాటుతోంది దీపిక. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ మరింతగా పెంచేసుకుంటున్నారు. అయితే వీళ్ల కెరియర్ గురించి అందరికీ తెలిసినప్పటికీ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఇలాంటి కాస్ట్ల్లీ కపుల్ ఇంకెంత కాస్ట్లీ లైఫ్ లీడ్ చేస్తారన్నది బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో నివసించే ప్రతీ ఒక్కరి డైలీ లైఫ్ స్టైల్ చాలా రిచ్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖరీదైన బంగ్లాల్లో నివసిస్తూ లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు. అలాంటిది స్టార్లుగా వెలుగొందుతున్న రణ్వీర్ సింగ్-దీపికా పదుకొణెల జంట ఇంకెలా జీవిస్తుంది. తగ్గేదే లే అంటూ ఈ జంట కూడా లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. ఖరీదైన కార్లు బంగ్లాలు వీరి పేరు మీద ఉన్నాయి. ముంబాయిలోని పలు ఖరీదైన ప్రాంతాల్లో ఈ జంటకు ఎంతో విలువైన విల్లాలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే కార్లు వీరి గ్యారేజ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాయి. మరి ఇంతకీ వారు ఏయే కార్లు వినియోగిస్తున్నారు, వాటి ధర ఎంత అన్న వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
1/ 18
.

Loading...