Meenakshi Chaudhary Latest Photos : ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో 'గుంటూరు కారం' బ్యూటీ.. మీనాక్షి లేటెస్ట్ ఫొటోస్ చూశారా ?
Meenakshi Chaudhary Latest Photos :'గుంటూరు కారం' సినిమాతో పాటు మరో రెండు భారీ ప్రాజెక్టులతో తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరీ.. తాజాగా ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో మెరిసి కనువిందు చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు చూశారా?

1/ 11
Meenakshi Chaudhary Latest Photos : మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో అంతే ట్రెండ్‌లోనూ ఉంది. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన నటిస్తున్న ముద్దుగుమ్మలపై అందరి దృష్టి పడింది. ఒకరేమో వరుస ఆఫర్లలో సందడి చేస్తున్న శ్రీలీల కాగా.. మరొకరేమో హిట్ 2 సినిమాతో తన ఖాతాలో హిట్ వేసుకున్న మీనాక్షి చౌదరి. తన అందంతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ చిన్నది.. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆమె నటించిన తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ.. ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన 'ఖిలాడి' సినిమాలో మెరిసి సందడి చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే మీనాక్షికి మాత్రం 'హిట్ 2' రూపొంలో మంచి హిట్ దక్కింది. ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు వరుణ్ తేజ్ సరసన 'మట్కా', విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న #VS10లో లీడ్ రోల్స్ చేస్తోంది. తాజాగా ఈ చిన్నది తన ఫ్యాన్స్ కోసం లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసి అలరిస్తోంది. వాటిని మీరు కూడా చూసేయండి..
Loading...
Loading...
Loading...