తాతకు తగ్గ మనవడు.. ఘట్టమేదైనా.. పాత్ర ఏదైనా.. రికార్డులు బద్దలవ్వాల్సిందే!
Updated: May 20, 2023, 9:53 AM |
Published: May 20, 2023, 9:53 AM
Published: May 20, 2023, 9:53 AM
Follow Us 

జూ. ఎన్టీఆర్... ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మనవడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయిన తారక్.. తన నటనతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో అలరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మే 20న జన్మదినం జరుపుకుంటున్న జూ. ఎన్టీఆర్.. సినీ కెరీర్లో పోషించిన కొన్ని ప్రధాన పాత్రలు చూద్దాం.

1/ 12
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ అంటే ఓ సెన్సేషన్. సినిమా నటుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఓ వెలుగు వెలిగిన మహనీయుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ తర్వాత ఆ కుటుంబంలో ఆయన కుమారుడు బాలకృష్ణ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. కానీ ఈ తరంలో ఆయన క్రేజ్‌ను అందుకునే వారసులు ఉన్నారా అనే సందేహాలకు ఛాన్స్ ఇవ్వలేదు జూ. ఎన్టీఆర్. బాల రామాయణం సినిమాతో తెరపైన మొదటిసారి శ్రీ రాముడి పాత్రలో కనిపించిన జూ. ఎన్టీఆర్.. 'నిన్ను చూడాలని' సినిమాతో టాలీవుడ్లో హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'స్టూడెంట్ నం.1'తో హిట్ అందుకున్నారు. వి.వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఆది'తో ఫ్యాక్షన్ జోనర్లో ప్రేక్షకులకు తనలోని మాస్ యాంగిల్ చూపించారు. తర్వాత 2004లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో 'ఆంధ్రావాలా' చిత్రం చేశారు. ఈ సినిమాలో కంప్లీట్ లో ప్రొఫైల్ మాస్ క్యారెక్టర్లో ఆడియోన్స్ని మెప్పించారు. ఇలా బాల రామాయణం సినిమా మొదలుకొని గతేడాది వచ్చిన 'ఆర్ఆర్ఆర్' వరకు జూ. ఎన్టీఆర్ వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అందులో కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్లు ఎంటో చూద్దాం.
Loading...
Loading...
Loading...