సమంత డివోషనల్ మోడ్.. 'శాకుంతలం' టీమ్‌తో పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
Published: Mar 15, 2023, 3:07 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న పెద్దమ్మ గుడిని సందర్శించారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి.. సారె సమర్పించారు. శాకుంతలం చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు గుణశేఖర్, కథానాయకుడు దేవ్ మోహన్, నిర్మాతలు నీలిమ, హర్షితలో కలిసి సమంత.. పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు. భక్తులతో కలిసి అతి సాధారణంగానే అమ్మవారిని దర్శించుకున్నారు. శాకుంతలం చిత్ర ప్రచార కార్యక్రమాల్ని అమ్మవారి గుడి నుంచి మొదలుపెట్టామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవలే హీరోయిన్ సమంత ఈ చిత్రంపై స్పందించారు. సినిమాను చూశానని.. ఈ చిత్రం తన మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుందని చెప్పారు. గుణశేఖర్ ఈ సినిమాను ఎంతో అందంగా తీర్చిదిద్దారని.. ఒక గొప్ప ఇతిహాసానికి మనోహరంగా జీవం పోశారని తెలిపారు సమంత. "ఇందులోని భావోద్వేగాలు చిన్న పిల్లలు సహా అందరికీ నచ్చుతాయి. ఈ చిత్రం నా మనసులో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇంత మంచి సినిమాను ఆడియన్స్‌తో కలిసి చూడడం కోసం వెయిట్ చేస్తున్నాను" అని సమంత తెలిపారు. ఈ సినిమా చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పారు సమంత. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత.. శకుంతల పాత్రను పోషించగా.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. మోహన్‌బాబు, గౌతమి, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.

