మత్తు చూపులతో మాయ చేస్తున్న గీతికా తివారీ
Updated: May 25, 2023, 9:31 AM |
Published: May 25, 2023, 8:32 AM
Published: May 25, 2023, 8:32 AM
Follow Us 

Geethika Tiwary Ahimsa Movie Heroine : ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్లో దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'అహింస'. ఈ సినిమాలో గీతికా తివారీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం జూన్ 2న విడుదలవుతున్న సందర్భంగా తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ హిందీ బ్యూటీ.

1/ 18
Geethika Tiwary Ahimsa Movie Heroine : ''తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్టం. తేజ దర్శకత్వంలో పరిచయం అవుతుండడం అదృష్టంగా భావిస్తున్నా'' అని చెప్పింది గీతికా తివారీ. మోడల్‌గా పలు ప్రకటనలలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు 'అహింస'తో జూన్ 2న ప్రేక్షకుల మందుకు వస్తోంది. ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆవేంటో ఆమె మాటల్లోనే.. "సంస్కృతి, ప్రకృతి, కుటుంబంతో ముడిపడిన కథ...'అహింస'. ఇందులో నా పాత్ర పేరు అహల్య. అమాయకంగా కనిపించే ఆమె.. శక్తిమంతమైన యువతిగా ఎదిగే తీరు ఆకట్టుకుంటుంది. దర్శకుడు తేజ.. ఆ పాత్ర గురించి చెప్పినప్పుడే నేను పూర్తిగా ప్రేమలో పడిపోయా. కథలో కీలకమైన ఆ పాత్ర ప్రయాణం నాకు అంతగా నచ్చింది. ప్రేమపై నమ్మకమున్న అహల్య పడే కష్టాలు, ఆమెకి ఎదురయ్యే సవాళ్లు సినిమాలో కీలకం. దర్శకులు తేజ ఆయన శైలిలోనే అద్భుతంగా నన్ను చూపించారు. మాది మధ్య ప్రదేశ్‌లోని జబల్పూర్. డిగ్రీ తర్వాత గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టా. మొదట కొన్ని ప్రకటనల్లో నటించా. ఆ తర్వాత సినిమాలవైపు దృష్టి పెట్టా. దర్శకుడు తేజ ఆడిషన్స్‌కి పిలిచారు. ఆయనకి నచ్చడంతో నేను ఎంపికయ్యా. 90 శాతం చిత్రీకరణ మధ్యప్రదేశ్‌లోని అడవీ ప్రాంతంలోనే చేశాం. చాలా దట్టమైన అడవుల్లోని లొకేషన్లలో చిత్రీకరణ సాగింది. అదొక మంచి అనుభవం. తొలి సినిమాతోనే చిత్రీకరణ సమయంలో నటులకి ఎదురయ్యే సవాళ్లు అనుభవంలోకి వచ్చాయి. అభిరామ్ మంచి సహనటుడు. సదా, రజత్బేడీ, మనోజ్ టైగర్ తదితరులతో కలిసి నటించడం మంచి అనుభవం. నాకు డాన్స్ అంటే ఇష్టం. ఇందులో నాలుగు పాటలున్నాయి. అవన్నీ చాలా బాగుంటాయి. ఆర్పీ పట్నాయక్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఓ నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది.'' అని చెప్పుకొచ్చింది ఈ హిందీ సుందరి.
Loading...
Loading...
Loading...