'ఆమె'తో ఎన్టీఆర్ 30 సినిమాలు ప్లస్సూ.. తారకరాముడి సూపర్ హిట్ జోడీలు వీరే!
Updated: May 28, 2023, 10:54 AM |
Published: May 28, 2023, 9:51 AM
Published: May 28, 2023, 9:51 AM
Follow Us 

ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ సినిమాల్లో సెస్సేషన్లు సృష్టించాయి. ఈ జంట స్క్రీన్‌పై కనిపిస్తే ఇక థియేటర్లో ఈలల మోతలు మోగుతాయి. అలాంటి ఎన్నో హిట్ పెయిర్స్‌ను సినిమాల్లోకి తీసుకొచ్చారు ఎన్టీఆర్. ఆయనతో పలువురు హీరోయిన్స్ సైతం పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. వారెవరంటే..

1/ 10
సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తన నటనతో విశ్వవిఖ్యాతిగాంచిన ఎన్టీఆర్.. తన సినిమాల్లోని పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. నటించిన ప్రతి పాత్రకు న్యాయం చేసి అందులో లీనమైపోతారు. ఆరు పదుల వయసలోనూ అప్‌కమింగ్ స్టార్స్‌కు ధీటుగా తెరపై కనిపించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. కాగా అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు చేయాలంటే హీరోయిన్లు ఎంతో ఆసక్తిని కనబరిచేవారట. ఆయనతో కనీసం ఒక్క సినిమాలో అయినా నటిస్తే చాలంటూ అనుకున్న హీరోయిన్లు ఎంతో మంది. అయితే అప్పటి కాలం కథానాయికలు ఎంతో మంది ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుని స్టార్ హీరోయిన్లగా ఎదిగారు. ఈ హిట్ కాంబినేషన్లు సైతం ప్రజల్లో చెరగని ముద్రలు వేశాయి. వెండితెరపై ఈ జంటను చూస్తే.. ఇక థియేటర్లలో ఈలల మోతే. వీరిలో ఎన్టీఆర్ - వాణిశ్రీ, ఎన్టీఆర్ - సావిత్రిల కాంబినేషన్ ఎవర్ గ్రీన్. ఇలా టాలీవుడ్లో క్రేజ్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ సూపర్ హిట్ కాంబోలు మీ కోసం..
Loading...
Loading...
Loading...