పొట్టి డ్రెస్సులు.. మిర్రర్ సెల్ఫీలు.. అల్లు స్నేహ అందాలు అదుర్స్!
Updated: Mar 18, 2023, 2:13 PM |
Published: Mar 18, 2023, 2:13 PM
Published: Mar 18, 2023, 2:13 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహా రెడ్డికి అంతే క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలోనూ బన్నీ సతీమణికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా మిర్రర్ సెల్ఫీలతో అల్లు స్నేహ అదరగొట్టేసింది. ఇంకా ఎవరికి ఇలా మిర్రర్ సెల్ఫీలు దిగడం అంటే ఇష్టం అని అడుగుతూ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో స్నేహా రెడ్డి ధరించిన దుస్తులు చూస్తే అంతా నోరెళ్లబెట్టేయాల్సిందే.

1/ 19
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహా రెడ్డికి అంతే క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలోనూ బన్నీ సతీమణికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్నీ చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను తరుచుగా షేర్ చేసే స్నేహారెడ్డి.. లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోయిన్లకు దీటుగా మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తుంది. యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాజాగా మిర్రర్ సెల్ఫీలతో అల్లు స్నేహా రెడ్డి అదరగొట్టేసింది. ఇంకా ఎవరికి ఇలా మిర్రర్ సెల్ఫీలు దిగడం అంటే ఇష్టం అని అడుగుతూ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో స్నేహా రెడ్డి ధరించిన దుస్తులు చూస్తే అంతా నోరెళ్లబెట్టేయాల్సిందే. సౌత్ మొత్తంలో హీరోల భార్యలందరిలోనూ స్నేహా రెడ్డి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. అందరి కంటే ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లున్న సెలెబ్రిటీగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే ఆమె ఖాతాకు 8.8 మిలియన్ల ఫాలోవర్లున్నారు. స్టార్ హీరోలకు సైతం ఈ రేంజ్ ఫాలోవర్లు లేకపోవడం విశేషం.

Loading...