నాలుగు పదాలతో ట్వీట్.. నెట్టింట ఫుల్ ట్రెండింగ్.. 'స్నేహ' క్రేజ్ మాములుగా లేదుగా!
Published: Mar 6, 2023, 1:41 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహా రెడ్డికి అంతే క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలోనూ బన్నీ సతీమణికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్నీ చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను తరుచుగా షేర్ చేసే స్నేహారెడ్డి.. లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోయిన్లకు దీటుగా మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తుంది. యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది. అవి చూసిన నెటిజన్లు.. మేడమ్ సర్.. మేడమ్ అంతే.. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గట్లేదుగా అంటూ కామెంట్స్ చేస్తుంటారు. అయితే అల్లు అర్జున్- స్నేహ దంపతులకు స్టైలిష్ కపుల్‌గా ఇండస్ట్రీలో పేరుంది. సోమవారం ఈ కపుల్ తమ 12వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అల్లుఅర్జున్.. తన సోషల్ మీడియాలో హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ నాలుగు పదాలతో పోస్ట్ పెట్టారు. అంతే ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ట్విట్టర్లో ఒక్కసారిగా అల్లు స్నేహా రెడ్డి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాని బట్టి చూస్తుంటే స్నేహా రెడ్డికి క్రేజ్ మామూలుగా లేదన్నమాట!

