ఒక్క ఇన్‌స్టా పోస్ట్ చేస్తే ప్రియాంకకు రూ.3 కోట్లు!.. మరి సామ్‌కు ఎంతంటే?
Updated: Mar 19, 2023, 1:18 PM |
Published: Mar 19, 2023, 1:16 PM
Published: Mar 19, 2023, 1:16 PM

సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండే బ్యూటీలు.. తమ పర్సనల్ పోస్ట్‌లతో పాటు బ్రాండ్ ప్రమోషన్లను చేస్తుంటారు. అందుకు వారు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంటారు. సౌత్ నుంచి నార్త్ వరకు చాలా మంది సెలబ్రిటీలు ఈ జాబితాలో ఉన్నారు. ఒక్కో పోస్ట్ ద్వారా కొన్ని లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. వారెవరో ఓ సారి చూసేద్దామా..

1/ 13
సినీ తారలు అటు తెరపైన.. ఇటు తెరవెనుక ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. స్క్రీన్‌పై సినిమాలతో సందడి చేస్తే.. స్క్రీన్ వెనుక సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి అభిమానులకు టచ్‌లో ఉంటారు. అయితే సామాజిక మాధ్యమాల్లో తరచూ దర్శనమివ్వని తారలు అప్పుడప్పుడు ఓ ఫొటో లేక వీడియో పెట్టి అభిమానుల్లో భారీ రేంజ్లో క్రేజ్ సంపాదిస్తుంటారు. అలా సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఇన్స్టాగ్రామ్ వేదిక అయ్యింది. ఇందులో వీరి ఒక్కో పోస్ట్‌కు నిమిషాల్లోనే కొన్ని లక్షల్లో లైక్‌లు వస్తుంటాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బ్రాండ్ ప్రమోషన్ల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తమ అభిమాన తారల ఇచ్చే సూచనల కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ వారు ఏదైనా మంచి బ్రాండ్ ప్రమోట్ చేస్తే దాని వాడేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. దీంతో ప్రముఖ బ్రాండ్లు సైతం తమ ప్రమోషన్ల కోసం సెలబ్రిటీలను ఎంచుకుంటుంది. అయితే సామాన్యుల లాగా వీరు కేవలం పోస్ట్‌లు పెట్టి సరిపెట్టుకోరు. ఆయా పోస్ట్‌కు తగిన రెమ్యునరేషన్‌ను కూడా ఛార్జ్ చేస్తుంటారు. ఈ విషయంలో టాప్ పొజిషన్లో ఉన్నారు ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. అయితే ఈమె లాగే సినీ ఇండస్ట్రీలో మరికొంత మంది తారలు ఉన్నారు. వారెవరంటే?

Loading...