అదా.. అందాలు అలా ఆరబోస్తే ఆగిపోదా కుర్రాళ్ల ఎద!
Published: Mar 10, 2023, 10:37 PM

అదా శర్మ.. అంటే ఆల్ రౌండర్. అందులో ఎలాంటి సందేహం లేదు. డ్యాన్సుల నుంచి ఫైట్స్ వరకు.. ఏదైనా చేసేయగలదు. అన్నేసి క్వాలిటీలు ఏ హీరోలో కూడా ఉండవేమో! కానీ, అదేంటో.. ఆమె ముఖంలోని క్యూట్‌నెస్‌కు ఎన్నో అవకాశాలు రావాలి. కానీ పెద్దగా రావడం లేదు. అయినా సరే.. తన ప్రయత్నాలు తాను చేస్తోంది. తెలుగులో 'హార్ట్ఎటాక్' మూవీతో మనసు దోచిన ఈ బ్యూటీ.. తాజాగా తన ఫొటోలతో మరోసారి కుర్రాళ్ల గుండె దడ పెంచేస్తోంది. ఎప్పటికప్పుడు తన సూపర్, హాట్ ఫొటోస్‌తో సోషల్‌మీడియాను హాల్ చల్ చేస్తుంది. అదా శర్మ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ బ్యూటీ అదా శర్మ ఏం చేసినా వెరైటీగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. అందంతో మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. అయితే ఆ మధ్యకాలంలో నెటిజన్లకు ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది అదా. పెళ్లి కొడుకు కావాలని అడిగింది. "పెళ్లి కుమారుడు కావలెను. అతడు ఉల్లిపాయలు తినకూడదు. రంగు, కులం, ఫాలోవర్స్, రాశి.. లాంటి విషయాలతో పనిలేదు. కచ్చితంగా మూడు పూటలు నవ్వుతూ వంట వండాలి. క్రమం తప్పకుండా షేవింగ్ చేసుకోవాలి. సంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకోవాలి. మద్యం, మాంసాహారం ఇంటా బయట నిషేధం. భారత్‌లోని అన్ని భాషా చిత్రాలపై గౌరవం ఉండాలి. వాటిని చూసి ఆస్వాదించే వాడై ఉండాలి." అని రాసుకొచ్చింది. అప్పట్లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

