ఆ విషయంలో హృతిక్ రోషన్‌కు స్ఫూర్తి తన తల్లేనట.. 68 ఏళ్ల వయసులోనూ ఆమె వర్కౌట్లు అదుర్స్!
Updated: May 20, 2023, 11:46 AM |
Published: May 20, 2023, 11:46 AM
Published: May 20, 2023, 11:46 AM
Follow Us 

శరీరం ఫిట్‌గా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఇప్పటి ఉరుకుల పరుగుల జీవన విధానంలో శరీరం దృఢంగా ఉండాలంటే దీనికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా చేయటం కూడా ముఖ్యమే. అయితే ఏ రంగంలోనైనా మనిషి రాణించాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. అయితే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఆయన అలా ఫిట్‌గా ఉండేందుకు తన తల్లే ఆయనకు స్ఫూర్తిదాయకం అట. మరి ఈయనే ఇలా ఉంటే.. హృతిక్ తల్లి జిమ్‌లో ఎలా వర్కౌట్లు చేస్తుందో చూసేయండి.

1/ 15
శరీరం ఫిట్‌గా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దగ్గరకు రావు. మనిషి ఫిట్నెస్గా ఉంటే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయగలడు. అయితే ఏ రంగంలో అయినా మనిషి రాణించాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. ఈ క్రమంలో శారీరక శ్రమ, వ్యాయామం లాంటివి.. కొందరిలో పెరుగుతున్న వయస్సును బాహ్య ప్రపంచానికి కనిపించనివ్వవు. అయితే ఈ సూత్రాన్ని మన సినిమా స్టార్లు ఎక్కువగా పాటిస్తూ కనిపిస్తుంటారు. అంతే కాకుండా దీని వల్ల సక్సెస్ కూడా అవుతుంటారు. ముఖ్యంగా ఈ తరం సినీ స్టార్స్.. షూటింగ్ స్పాట్ల తర్వాత జిమ్‌లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ల నుంచే హృతిక్ ఎంతో మందికి ఫిట్నెస్ విషయంలో స్ఫూర్తిగా నిలిచారు. హృతిక్ రోషన్ ఇప్పటికీ రోజుకు తగినంత వ్యాయమం చేస్తుంటారు. అయితే ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన హృతిక్ మాత్రం వాళ్ల అమ్మ నుంచి స్ఫూర్తిని పొందారట. ప్రస్తుతం హృతిక్ తల్లి పింకీ రోషన్ వయసు 68 ఏళ్లు. ఆమె ఇప్పటికి జిమ్‌లో తగినన్ని వర్కౌట్లు చేస్తూ ఈ వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారో చూసేయండి.
Loading...
Loading...
Loading...