ఎన్నో ఆడిషన్స్​.. మరెన్నో అవమానాలు.. కానీ ఆ ఒక్క పాత్రతో లైఫ్​ టర్న్​!

author img

By

Published : Jun 14, 2022, 6:05 PM IST

nookaraju

Jabardast Nookaraju: బుల్లితెరపై కొన్ని ప్రత్యేకమైన​ పాత్రలు పోషించి తన ప్రతిభను చాటుకున్నాడు 'జబర్దస్త్​' నూకరాజు. తాజాగా ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఎంటర్​టైన్​మెంట్​ రంగంలోకి ఎలా వచ్చాడు? ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? తన లక్ష్యం ఏమిటి? వంటివి వెల్లడించాడు. అవన్నీ అతడి మాటల్లోనే..

నూకరాజు

Jabardast Nookaraju: మధ్య తరగతి కుటుంబం.. ఓ చిన్న ఉద్యోగం.. కానీ నటన, కామెడీషోస్​పై ఉన్న ఆసక్తి అతడిని ఇండస్ట్రీ వైపు నడిపింది. కానీ ఎన్నో ఆడిషన్స్​కు వెళ్లినా అవకాశాలు రాలేదు. మాటలు కూడా పడ్డాడు! నిరుత్సాహం వెంట పడినా.. కళనే నమ్ముకున్నాడు. చివరకు ఓ కామెడీ షో ద్వారా తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కెరీర్​లో ముందుకు సాగాడు. కట్​ చేస్తే ఓ పాత్ర తన లైఫ్​ను మలుపు తిప్పింది. మంచి పేరు తెచ్చి పెట్టింది. అతడే 'జబర్దస్త్​' నూకరాజు. తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన అతడు ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు? ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? తన లక్ష్యం ఏమిటి? వంటి విషయాలను తెలిపాడు.

"నేను విజయవాడలో పుట్టాను. 'జబర్దస్త్'​లో ఉండటం​ చాలా సంతోషంగా ఉంది. ఇంటి దగ్గర కూడా సరదాగా నవ్వించేవాడిని. అందరూ బాగా నవ్విస్తున్నాను అనేవారు. అలా సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలనిపించింది. చాలా ఆడిషన్స్​​ ట్రై చేశాను. అవకాశాలు రాలేదు. ఏదేదో అనేవారు. ఆ తర్వాత 'జీ' తెలుగులో 'కామెడీ ఖిలాడి', 'పటాస్'​, 'పిట్టగోడ'.. అనంతరం 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో చేశాను.​ చంటి స్కిట్​లలో నటించాను.

మొదట చిన్న చిన్న పాత్రలు చేశాను. అలా ఓ రోజు హిజ్రా రోల్​ చేశాను. దాంతో మంచి పేరు వచ్చింది. అప్పుడు నన్ను గుర్తించారు. కాస్త పెద్ద పాత్రలు ఇవ్వడం ప్రారంభించారు. జీహెచ్​ఎంసీ సహా పలు స్పెషల్​ స్కిట్​లు చేశా. వాటి వల్ల మరింత గుర్తింపు వచ్చింది. ఇది నాకు గొప్ప అనుభూతినిచ్చింది. ప్రసన్న, శ్రీను, చంటి ఇలా ముగ్గురు, నలుగురు నన్ను బాగా ప్రోత్సాహించారు. చంటి చేసే స్కిట్​లకు, 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లోని కొన్ని ఈవెంట్​లకు స్క్రిప్ట్​లు నేనే రాస్తున్నాను. సినిమాలు చేసినా టీవీని మాత్రం ఎప్పటికీ వదలను. విలన్​, ఎమోషన్​, అమాయకం ఇలా అన్నీ పాత్రలు చేయాలి. ఓ క్యారెక్టర్​ ఆర్టిస్ట్​ అవ్వాలనేదే నా కోరిక" అని నూకరాజు పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: గవర్నమెంట్​ జాబ్ వదిలేసి వచ్చా... లేడీ గెటప్స్​తో మహా టార్చర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.