లావణ్య​తో వరుణ్ తేజ్​ మ్యారేజ్.. మెగా డాటర్​ రియాక్షన్ ఇదే!

author img

By

Published : May 18, 2023, 10:49 AM IST

Updated : May 18, 2023, 12:55 PM IST

varun tej and lavanya tripathi marriage

Varun Tej and Lavanya Tripathi Marriage : మెగా ప్రిన్స్​ వరుణ్‌ తేజ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది. టాలీవుడ్​ హీరోయిన్​ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సోషల్​ మీడియాలో ఓ వార్త సోమవారం నుంచి చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై తాజాగా మెగా డాటర్ నిహారిక​ స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

Varun Tej and Lavanya Tripathi Marriage : మెగా ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత, నటుడు, మెగా బ్రదర్​ నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​ పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం సాగుతోంది. టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయబోతున్నారని నెట్టింట్లో వార్తలులో చక్కర్లు కొడుతున్నాయి.
గత కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్​షిప్​లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. సోమవారం నుంచి సోష​ల్​ మీడియాలో మరీ ఎక్కువయ్యాయి. దీంతో వీరి పెళ్లి విషయం మరో సారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరికి జూన్​లో నిశ్చితార్థం జరుగుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగనుందని ఆ వార్తల సమాచారం.

తన తదుపరి ప్రాజెక్ట్‌ 'డెడ్‌ పిక్సెల్స్‌' (Dead Pixels) ప్రమోషన్స్‌లో గత కొన్నిరోజుల నుంచి బిజీగా పాల్గొంటున్నారు నటి నిహారిక. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.. వరుణ్​- లావణ్య విషయంపై యాంకర్​ ప్రశ్నించారు. దీనిపై స్పందించేందుకు నిహారిక అసహనం వ్యక్తం చేశారు. 'ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కేవలం 'డెడ్‌ పిక్సెల్స్‌' గురించే చర్చించాలనుకుంటున్నా' అని బదులిచ్చారు.

Varun Tej and Lavanya Tripathi Relationship : అయితే, ఈ ఏడాది జనవరిలో లావణ్య త్రిపాఠి బర్త్​డే పార్టీ బెంగళూరులో ఘనంగా జరిగింది. ఆ పార్టీలో లావణ్యకు.. వరుణ్ ఓ కాస్ట్లీ డైమండ్​ రింగ్​తో ​ప్రపోజ్​ చేశాడని.. ఆ ప్రపోజల్​కు లావణ్య కూడా ఓకే చెప్పిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఓ నెల తర్వాత ఈ రూమర్స్​పై స్పందించిన నాగబాబు.. ఈ ఏడాదిలోనే వరుణ్​ పెళ్లిచేసుకోబోతున్నారని.. వధువు వివరాలు త్వరలోనే మీడియాకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. దీంతో లావణ్య-వరుణ్​ రిలేషన్​షిప్ రూమర్స్​కు మరింత బలం చేకూరింది. అయితే, ఈ వార్తలపై అటు వరుణ్​ తేజ్​ గాని, ఇటు లావణ్య త్రిపాఠి గాని స్పందించలేదు. వారు నోరు విప్పితేనే ఈ వార్తలపై క్లారిటీ వస్తుంది.

Varun Tej and Lavanya Tripathi Movies : వరుణ్‌ తేజ్‌ హీరోగా చేసిన 'మిస్టర్‌', 'అంతరిక్షం' సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది లావణ్య త్రిపాఠి. ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఆ మధ్య అందరూ చెవులు కొరుక్కున్నారు. అంతేకాకుండా వరుణ్‌ సోదరి నటి నిహారిక పెళ్లికి లావణ్య హాజరైంది. దీంతో ఆ వార్తలకు మరింత బలం వచ్చింది.

Last Updated :May 18, 2023, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.