మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత
Updated on: Sep 28, 2022, 2:22 PM IST

మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత
Updated on: Sep 28, 2022, 2:22 PM IST
07:12 September 28
మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత
ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ తల్లి ఇందిరాదేవి(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం వేకువజామున హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
కృష్ణ-ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. కుమారులు రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో పెద్దకుమారుడు రమేశ్‌బాబు అనారోగ్యంతో మృతిచెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇవీ చదవండి: అలనాటి అందాల తార ఆశాపరేఖ్‌కు 'దాదాసాహెబ్ ఫాల్కే'
