Bichagadu 2 : 'ఇదేం టైటిల్'​ అన్నారు.. కట్​ చేస్తే సంచలనం.. మరి ఇప్పుడేం చేస్తుందో?

author img

By

Published : May 18, 2023, 4:09 PM IST

బిచ్చగాడు 2 రిలీజ్ డేట్​

Bichagadu 2 : 'శ్రీమంతుడు', 'రాజకుమారుడు'.. ఇలాంటి పేర్లు పెడితే బాగుంటుందిగానీ 'బిచ్చగాడు' టైటిల్ ఏంది.. 'అసలు ఇలాంటి టైటిల్​ పెడతారా?', 'సినిమాకు ప్రేక్షకులు వస్తారా?', 'అసలు ఇది ఆడే సినిమా కాదు' అని విమర్శించారు. 2016లో అటు కోలీవుడ్‌.. ఇటు టాలీవుడ్​లో ఇదే చర్చ. కట్​ చేస్తే.. బాక్సాఫీస్​ ముందు సంచలనం. కోట్ల రూపాయల కలెక్షన్లు.. విమర్శించిన వారి నోళ్లు మూయించి.. వారిని ఆశ్చర్యపరిచింది. అదే 'బిచ్చగాడు' సినిమా. ఇప్పుడా ట్యాగ్​తోనే 'బిచ్చగాడు 2'.. ఈ శుక్రవారం(మే 19) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని విశేషాలు మీకోసం..

Bichagadu 2 : 'శీను', 'రోజాపూలు' వంటి పలు రొమాంటిక్‌ చిత్రాలతో ఆడియెన్స్​ను అలరించారు దర్శకుడు శశి. 2013 తర్వాత తల్లీకొడుకుల అనుబంధం ఆధారంగా ఓ స్టోరీ రాసుకున్నారు. దాన్ని సినిమా మలిచేందుకు ఎందరో హీరోలను సంప్రదించారు. 'ఈ సినిమాలో మీది కోటీశ్వరుడిగా కనిపించే హీరో పాత్ర. మీరు చిటికేస్తే చాలు.. మీకు కావాల్సినవన్నీ ఇట్టే దగ్గరికీ వచ్చేస్తాయి' అని కథను చెప్పి ఉంటే.. హీరోలు అంగీకరించేవారేమో. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఈ చిత్రంలో హీరో బిలీనియరే అయినప్పటికీ.. తీవ్ర అనారోగ్యంతో మంచం పడిన తల్లిని కాపాడుకునేందుకు బిచ్చగాడు అవతారం ఎత్తాల్సి ఉంటుంది. మరి, బిచ్చగాడుగా కనిపించేందుకు ఏ హీరో మాత్రం సాహసం చేస్తాడు. దీంతో శశి డీలా పడిపోయారు. అపుడు 'నేనున్నానంటూ' విజయ్‌ ఆంటోనీ ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందే శశి.. తన 'డిష్యుం' సినిమాతో విజయ్‌ ఆంటోనీని మ్యూజిక్ డైరెక్టర్​గా ఇంట్రడ్యూస్​ చేశారు. ఆ స్నేహంతోనే.. శశి విజయ్‌కు స్క్రిప్టు వినిపించడం.. ఇద్దరి మధ్య చర్చలు జరగడం జరిగాయి. దీంతో కథ వింటున్నప్పుడే ఎమోషనల్​ అయి కంటతడి పెట్టుకున్న విజయ్‌.. సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయారు. తన భార్య ఫాతిమాను నిర్మాతగా పెట్టుకుని సినిమాను ప్రారంభించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అక్కడ హిట్‌.. ఇక్కడ డబుల్​ హిట్‌.. అంతా బాగునప్పటికీ.. టైటిల్‌ విషయంలో మళ్లీ పెద్ద చర్చ. 'బిచ్చగాడు' నేపథ్యమే.. ఈ కథకు కీలకం అవ్వడంతో అదే పేరును సినిమా టైటిల్​గా పెట్టాలనుకున్నారు. కానీ శశి మనసులో ఎక్కడో భయం. ఆడియెన్స్​ ఈ టైటిల్​ను స్వీకరిస్తారా అని? అప్పటికే కొంతమంది విమర్శించారు కూడా. ఇక్కడ కూడా విజయ్‌.. శశికి సపోర్ట్‌ నిలుస్తూ.. 'పిచైక్కారన్' టైటిల్ పెట్టారు. కానీ ఈ టైటిల్​తో సినిమా ప్రదర్శనకు కొన్ని థియేటర్‌ యాజమాన్యాలు అంగీకరించలేదు. అయినా అదే పేరుతో సినిమాను 2016 మార్చి 4న తమిళనాడులో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. సినిమా ఎమోషన్‌కు బాగా కనెక్ట్‌ ఆడియెన్స్​కు బాగా కనెక్ట్ అయింది.

అయితే ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్‌కు చూపించాలనుకున్నారు. దీన్ని రీమేక్‌ చేయాలనుకున్నారు. శ్రీకాంత్‌లాంటి ప్రముఖ హీరోలతో కూడా చర్చలు జరిగాయి. కానీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో తెలుగులో డబ్‌ చేసి 'బిచ్చగాడు' పేరుతో 2016 మే 13న రిలీజ్​ చేశారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దీన్ని విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌కి మించిన విజయాం దక్కింది. విజయ్‌ ఆంటోనీ అనే హీరోను ఇక్కడివారికి పరిచయం చేసింది. తమిళ వెర్షన్‌ రూ. 16 కోట్లు(అంచనా) వసూలు చేస్తే.. తెలుగులో ఏకంగా రూ. 26 కోట్ల(అంచనా) వసూళ్ల వరకు సాధించింది. డబ్బింగ్​ సినిమా అయి.. 100 రోజులకిపైగా ప్రదర్శితమైంది. ఇది మాములు విషయం కాదు. కథతోపాటు విజయ్‌ యాక్టింగ్​, సాంగ్స్​.. అన్నీ కీలక పాత్ర పోషించాయి. మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాకు విజయ్‌ ఆంటోనీనే సంగీతం అందించారు. అప్పటికే ఆయన తెలుగులో 'మహాత్మ', 'దరువు'కు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

ఇప్పుడు భారీ అంచనాలతో సీక్వెల్​.. అంచనాలు లేకుండా వచ్చిన 'బిచ్చగాడు' ఎవరూ ఊహించని రేంజ్​లో భారీ హిట్‌ను అందుకుంది. దీంతో 'బిచ్చగాడు 2'పై ఆడియెన్స్​లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్‌, ట్రైలర్స్​ కూడా ఆకట్టుకున్నాయి. అయితే ఇది తొలి భాగానికి సీక్వెల్‌ కాదని.. వేరే కథ అని చెప్పారు హీరో విజయ్‌. రెండింటిలో కొన్ని అంశాలు ఒకేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఫస్ట్ పార్ట్​ మదర్​ సెంటిమెంట్‌తో తెరకెక్కగా.. అందులో అరుళ్‌ అనే కోటీశ్వరుడిగా కనిపించారు విజయ్‌. ఇప్పుడు సిస్టర్​ సెంటిమెంట్‌తో రానున్న సెకండ్ పార్ట్​లో విజయ్‌ గురుమూర్తి పాత్రలో భారత్‌లో 7వ అత్యంత సంపన్నుడిగా విజయ్​ కనిపించనున్నారు. . పళని, పాల్‌ ఆంటోనీలతో కలిసి విజయ్‌ ఆంటోనీ ఈ సీక్వెల్ కథ రాశారు. డైరెక్షన్​తో పాటు మ్యూజిక్​ డైరెక్టర్​, ఎడిటర్‌గాను విజయ్​ ఆంటోని వ్యవహరించారు. ఆయన భార్య ఫాతిమా నిర్మాతగా వ్యవహరించారు. యాంటీ బికిలీ, బ్రెయిన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనే అంశాల్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. కావ్యా థాపర్‌ హీరోయిన్​గా నటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

భారీ ప్రమాదం నుంచి కోలుకుని.. సినిమాలోని కొన్ని సీన్స్​ను మలేసియాలోని లంకావి ప్రాంతంలో షూట్​ చేశారు. అప్పుడు ఓ భారీ ప్రమాదం జరిగింది. విజయ్‌ జెట్‌ స్కిని ఫుల్‌ స్పీడ్‌లో డ్రైవ్‌ చేయగా.. అది కాస్త అదుపుతప్పింది. బోటు గట్టిగా ఆయన ముఖానికి తగలి.. దవడ భాగం కిందకు జారింది. దీంతో వైద్యులు సుమారు 9 ప్లేట్లు వేశారట. ఫలితంగా విజయ్​.. నెలన్నరపాటు ద్రవ పదార్థాలే తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకుని మళ్లీ షూటింగ్‌ను పూర్తి చేశారు. మరి ఈ 'బిచ్​గాడు 2' ఆడియెన్స్​ను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి..

ఇదీ చూడండి: Pushpa 2 Update : 'షెకావత్ సర్​' కీలక షెడ్యూల్ కంప్లీట్​​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.