తొలి భారతీయ చిత్రంగా 'పఠాన్​' ఘనత.. రికార్డు స్థాయిలో..

author img

By

Published : Jan 24, 2023, 6:47 AM IST

Sharukh Pathan movie

బాలీవుడ్ బాద్​ షా షారుక్‌ ఖాన్‌ నాలుగేళ్ల విరామం తర్వాత 'పఠాన్‌'గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్​. బాయ్‌కాట్‌ పిలుపులు ఒక వైపు, బాక్సాఫీసును బద్దలుకొట్టేలా టికెట్ల అడ్వాన్స్‌ బుకింగులు మరోవైపు.. వెరసి ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత చిత్రం 'జీరో' ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో అటు షారుక్‌కు, భారీ బడ్జెట్‌ చిత్రాలు వరుసగా వైఫల్యం చెందుతున్న తరుణంలో ఇటు బాలీవుడ్‌కూ ఈ చిత్రం కీలకంగా మారింది. భారీ అంచనాలతో ఈ నెల 25న విడుదలవుతున్న 'పఠాన్‌' విశేషాలివీ.

దాదాపు ఐదేళ్ల తర్వాత బాలీవుడ్ కింగ్​ షారుక్​ ఖాన్ 'పఠాన్​'గా వెండితెరపై కనిపించనున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్​. భారీ అంచనాలతో యాక్షన్​ థ్రిల్లర్​గా రానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం..

  • ఐమ్యాక్స్‌ కెమెరాలతో చిత్రీకరించిన తొలి భారతీయ చిత్రం. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలవుతోంది. ఐమ్యాక్స్‌, 4డీఎక్స్‌, ఐసీఈ తదితర ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
  • విదేశాల్లోనూ అనూహ్య స్పందన వస్తోంది. అమెరికా, యుఏఈ, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో రికార్డు స్థాయిలో టికెట్లు
  • అమ్ముడుపోయాయి.
  • విడుదలకు ముందే దేశవ్యాప్తంగా పీవీఆర్‌, ఐనాక్స్‌, సినిపొలిస్‌ సంస్థలకు చెందిన మల్టీప్లెక్స్‌ థియేటర్లలో 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. బుక్‌ మై షోలో 10 లక్షలకు పైగా టికెట్లు బుక్కయ్యాయి. దీన్నిబట్టి తొలిరోజు వసూళ్ల విషయంలో గత రికార్డులన్నింటినీ బద్దలుకొట్టడం ఖాయమని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
  • వివాదాల నేపథ్యంలో విడుదలకు ముందు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని చిత్రబృందం నిర్ణయించింది.
  • 50 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ముంబయిలోని ప్రసిద్ధ గెయిటీ గెలాక్సీ థియేటర్లో, గతంలో ఎన్నడూ లేని విధంగా విడుదల రోజున ఉదయం 9 గంటలకే 'పఠాన్‌' చిత్రాన్ని ప్రదర్శించనుండటం విశేషం. అభిమానుల కోరిక మేరకు చాలా చోట్ల ఈ చిత్రాన్ని ఉదయం ఆరు గంటలకే ప్రదర్శించనున్నారు. ఈ ట్రెండ్‌ను ప్రారంభించిన తొలి బాలీవుడ్‌ చిత్రంగా 'పఠాన్‌' నిలవనుంది.
  • ఇదే సంస్థ గతంలో నిర్మించిన స్పై యూనివర్స్‌ చిత్రాలు 'ఏక్‌ థా టైగర్‌' సిరీస్‌, 'వార్‌'లో నటించిన సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ కూడా 'పఠాన్‌'లో అతిథి పాత్రల్లో మెరవనున్నట్లు తెలుస్తోంది.
  • జాన్‌ అబ్రహం ప్రతినాయక పాత్రలో నటించారు. షారుక్‌, జాన్‌ అబ్రహం మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని చిత్రబృందం చెబుతోంది. మిషన్‌ ఇంపాజిబుల్‌, టాప్‌ గన్‌ మేవరిక్‌ తదితర హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన యాక్షన్‌ డైరెక్టర్‌ కేసీ ఓ నీల్‌ ఈ చిత్రానికి పోరాటాలు సమకూర్చడం విశేషం.
  • దేశవ్యాప్తంగా మూతపడ్డ 25 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు 'పఠాన్‌'తో మళ్లీ తెరచుకోనున్నాయి.
  • దీపికా కూడా గూఢచారిగా నటించింది. షారుక్‌తో కలసి రొమాంటిక్‌ సన్నివేశాలు చేయడమే కాదు, భారీ పోరాటాలూ చేసింది. వీరి కలయికలో వస్తున్న నాలుగో చిత్రమిది.
  • బ్యాంగ్‌ బ్యాంగ్‌, వార్‌ లాంటి భారీ యాక్షన్‌ థ్రిల్లర్లతో మెప్పించిన సిద్ధార్థ్‌ ఆనంద్‌.. షారుక్‌తో తెరకెక్కించిన తొలి చిత్రమిది.
  • షారుక్‌ ఖాన్‌ గూఢచారిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక యష్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో, విదేశీ లొకేషన్లలో కళ్లు చెదిరే హంగులతో నిర్మించింది.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'షారుక్​తో స్క్రీన్​ షేరింగ్​ సో స్పెషల్​.. 'బేషరమ్​' సాంగ్​ కోసం చాలా కష్టపడ్డా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.