గంట గట్టిగా మోగించిన సర్కారువారి పాట.. తొలిరోజు ఆల్​టైం రికార్డు కలెక్షన్స్​!

author img

By

Published : May 13, 2022, 12:32 PM IST

sarkaru vaari paata

Mahesh Babu News: సూపర్​స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారువారి పాట చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలిరోజు రూ.36.89 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్​టైం​ నాన్​ ఆర్​ఆర్​ఆర్ రికార్డు సృష్టించింది.

Sarkaru vari paata collections: సూపర్​స్టార్​ మహేశ్​బాబు హీరోగా పరుశురామ్​ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారువారి పాట చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా 2వేలకుపైగా థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. కలెక్షన్ల పరంగా మాత్రం ఆల్​టైం నాన్​ ఆర్​ఆర్​ఆర్​ రికార్డు సృష్టించింది. తొలిరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ.53 కోట్ల గ్రాస్​, రూ.36.89కోట్ల షేర్ వసూలు​ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల గ్రాస్​, రూ.47.49కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఇందుకు సంబంధించి నిర్మాతలు అధికారిక పోస్టర్​ను కూడా విడుదల చేశారు.

ప్రాంతాలవారీగా తొలిరోజు కలెక్షన్ వివరాలు

  • నైజాం -రూ.12.24కోట్ల షేర్​
  • సీడెడ్​ -రూ.4.70కోట్లు
  • ఉత్తరాంద్ర -రూ.3.73కోట్లు
  • తూర్పు గోదావరి -రూ.3.25కోట్లు
  • గుంటూరు -రూ.5.83కోట్లు
  • పశ్చిమ గోదావరి -రూ.3కోట్లు
  • క్రిష్ణా -రూ.2.58కోట్లు
  • నెల్లూరు -రూ.1.56కోట్లు
  • తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్​ -రూ.36.89 కోట్లు
  • కర్ణాటక, రెస్ట్​ ఆఫ్ ఇండియా -రూ.3.60కోట్లు
  • అమెరికా, ఇతర దేశాలు -రూ.7కోట్లు
  • ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్​ -రూ.47.49, మొత్తం గ్రాస్ రూ.73కోట్లు
    sarkaru vaari paata
    గంట గట్టిగానే మోగించిన సర్కారువారి పాట.. తొలిరోజు ఆల్​టైం రికార్డు కలెక్షన్స్​!

Sarkaru vari paata: సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. ఎస్​ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు. కీర్తి సురేశ్ మహేశ్​కు జోడిగా నటించింది. సముద్రఖని విలన్​గా, నధియా, తనికెళ్లభరణి, వెన్నెల కిశోర్​, సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చిత్రం టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి లభించింది. అందుకే తొలిరోజు ఈ స్థాయిలో వసూళ్లు సాధ్యమయ్యాయని ట్రేడ్​ నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: అగ్ర హీరోల క్రేజీ ప్రాజెక్టులు.. జూన్​లో ముహూర్తాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.