RRR ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు

author img

By

Published : Jan 24, 2023, 7:38 AM IST

Updated : Jan 24, 2023, 7:49 AM IST

RRR Japan Award

ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు అంతర్జాతీయ స్థాయిలో మరో అవార్డు వరించింది. అదేంటంటే..

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా హవా హాలీవుడ్‌లో కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రానికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్​ గ్లోబ్ సహా క్రిటిక్స్​ ఛాయిస్​ అవార్డ్స్​లో బెస్ట్​ ఫారెన్​ లాంగ్వేజ్​ చిత్రం, నాటు నాటుకు బెస్ట్​ సాంగ్స్​.. రెండు పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 46వ జపాన్‌ అకాడమీ ఫిల్మ్‌ ప్రైజ్‌కు సంబంధించి 'అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌' విభాగంలో అవార్డు సాధించింది. 'అవతార్‌', 'టాప్‌గన్‌: మ్యావరిక్‌' వంటి హాలీవుడ్‌ చిత్రాలను దాటి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఈ జపాన్‌ పురస్కారాన్ని ముద్దాడం విశేషం.

దీంతో ఈ పురస్కారం అందడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూవీటీమ్​కు అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఆస్కార్‌ సాధించాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా 'ఆస్కార్‌' బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో నాటు నాటు పాట నామినేషన్స్​కు షార్ట్ లిస్ట్ అయింది. ఇకపోతే ఈ మూవీ.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లోనూ ఆస్కార్‌ కోసం పోటీ పడుతుంది. మరి కొన్ని గంటల్లో నామినేషన్స్ ఫైనల్‌ లిస్ట్ రానుంది.

కాగా, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. అలియాభట్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా, ఒలివియా మోర్రీస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఇదీ చూడండి: 'ఆస్కార్‌' ప్రతిమ నగ్నంగా ఎందుకు ఉంటుందో తెలుసా.. అసలా పేరు ఎలా వచ్చిందంటే?

Last Updated :Jan 24, 2023, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.