'RRR'కు ఆస్కార్​.. చిత్రంపై ప్రశంసల జల్లు.. చిరు, మోదీ, బాలకృష్ణ ఏమన్నారంటే?

author img

By

Published : Mar 13, 2023, 10:41 AM IST

Updated : Mar 13, 2023, 12:53 PM IST

Oscar 2023 RRR movie Naatu Naatu song

Oscars 2023 : 'నాటు నాటు' సాంగ్​కు ఆస్కార్ రావడంపై భారతీయ సినీ పరిశ్రమ ప్రశంసలు కురిపిస్తోంది. అటు సినీ ప్రమఖులతో పాటు రాజకీయ నాయకుల నుంచి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. చరిత్రలో మరుపురాని పాటగా ఇది నిలిచిపోతుందని ప్రధానమంత్రి మోదీ కితాబిచ్చారు.

Oscars 2023 : ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డ్​.. తెలుగు పాటకు దక్కడం పట్ల ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. అగ్ర కథానాయకుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ 'RRR' బృందాన్ని ప్రశంసిస్తున్నారు. ఆస్కార్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్​కు అభినందనలు తెలుపుతున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే?

ఒక తండ్రిగా గర్వపడుతున్నా : చిరంజీవి
'RRR' లోని నాటు నాటుకు ఆస్కార్ రావడం పట్ల అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. చరణ్ కూడా ఇందులో భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 'ఆర్ఆర్ఆర్'ను ఆస్కార్​కు తీసుకెళ్లేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కాలన్నారు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. ఒక తండ్రిగా గర్వపడుతున్నానని చెప్పిన చిరంజీవి.. రాజమౌళిని కృషిని ప్రశంసించారు.

'RRR'కు ఆస్కార్​.. చిత్రంపై ప్రశంసల జల్లు

భారతీయ సినిమా మరో స్థాయికి చేరింది : పవన్​
భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన 'ఆర్ఆర్ఆర్' చిత్ర సంగీత దర్శకులు ఎం. ఎం. కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్​గా నిలిచిన 'RRR'లోని 'నాటు నాటు' గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఈ గీతాన్ని ఆస్కార్ వేదికపై ప్రదర్శించడమే కాకుండా... అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా 'RRR' చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళికి ప్రత్యేక అభినందనలు. ఎన్టీఆర్, రామ్చరణ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్, నిర్మాత డీవీవీ దానయ్యలకు అభినందనలు" అని పవన్ కల్యాణ్ కొనియాడారు.

'RRR' ప్రధాని మోదీ అభినందనలు
95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డును అందుకున్న 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. 'నాటు నాటు' పాపులారిటీ ప్రపంచవ్యాప్తమైందని చెప్పారు. చరిత్రలో మరుపురాని పాటగా ఇది నిలిచిపోతుందని కితాబిచ్చారు. కీరవాణి, చంద్రబోస్​తో పాటు మొత్తం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అలాగే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు అందుకున్న 'ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్ర బృందాన్ని మోదీ అభినందించారు.

భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం : బాలకృష్ణ
ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డు గెలుపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్ర బృందానికి నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని 'నాటు నాటు' పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టమన్నారు. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిదని పేర్కొన్నారు. స్వరకర్త కీరవాణికి, గీత రచయిత చంద్రబోస్​కు, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

'RRR'లోని నాటునాటు పాట ఆస్కార్​ గెలుచుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు దర్శకుడు రాజమౌళి. ఆస్కార్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరైన రాజమౌళి.. అవార్డు ప్రకటించగానే ఆనందంతో గంతులేశారు. ఆయనతో పాటు భార్య రమ, కుమారుడు కార్తికేయ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక సినీ నటుడు నాగార్జున ట్విటర్ వేదికగా స్పందిస్తూ 'భారతీయ సినిమాకు ఇదొక చారిత్రక ఘట్టం' అని అన్నారు. సినీ అభిమానులనే కాదు, ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారని కితాబిచ్చారు. 'నాటు నాటు'కు ఆస్కార్ (Oscars 2023) అవార్డు రావడంపై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్లను చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయానని చెప్పారు.మనమూ ఆస్కార్ కొట్టొచ్చనే ధైర్యాన్ని 'ఆర్ఆర్ఆర్(RRR)' ఇచ్చిందని తెలిపారు. 'ఆర్ఆర్ఆర్(RRR)' నుంచి 'నాటు నాటు'కు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలో టాలెంటుకు కొదవ లేదని .. అందరూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇవీ చదవండి : హాలీవుడ్ గడ్డపై తెలుగు పాట సంచలనం.. 'నాటునాటు'కు ఆస్కార్ అవార్డు

ఆస్కార్​ను అందుకున్న కీరవాణి.. ఎమోషనల్​ అవుతూ ఏమన్నారంటే?

Last Updated :Mar 13, 2023, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.