రణ్​బీర్​, ఆలియా ఫ్యాన్స్​కు షాకింగ్​ న్యూస్​.. పాప ఫొటో విషయంలో ఇంకొంత కాలం సస్పెన్స్​ అంట..

author img

By

Published : Jan 8, 2023, 12:20 PM IST

alia and ranbir kapoor

రణ్​బీర్​- ఆలియా ముద్దుల కుమార్తె రాహాను చూసేందుకు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ షాకింగ్​ న్యూస్​. పాప ఫొటోను ఇంకొంత కాలం సన్పెన్స్​లో ఉంచనున్నట్లు తెలిపారు ఆలియా, రణ్​బీర్​.

బాలీవుడ్​ స్టార్​ కపుల్​ రణ్​బీర్​ కపూర్,​ ఆలియాల ముద్దుల తనయ రాహాను ఎప్పుడెప్పుడు చూస్తామన్న అభిమానులకు ఇక కొంతకాలం పాటు నిరీక్షణ తప్పదంటోంది ఆ జంట. ఈ విషయాన్ని శనివారం ముంబయిలో జరిగిన ఓ సమావేశంలో వెల్లడించారు. రాహాకు రెండేళ్లు వచ్చేంతవరకు ఎటువంటి ఫొటోలను పోస్ట్ చేయబోమని ఆలియా, రణ్​బీర్​ తెలిపారు. అంతే కాకుండా ఫొటోగ్రాఫర్లు సైతం బయట వారు కనిపించినప్పుడు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయొద్దని కోరారు.​ ఈ మీడియా సమావేశానికి రణ్​బీర్,​ ఆలియాల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

కాగా రణ్​బీర్,​ ఆలియాల గారాలపట్టి రాహా 2022 నవంబర్​ 6న జన్మించింది. అప్పటి నుంచి వీరిద్దరు తన పేరు గురించి తప్ప మరే సమాచారాన్ని బయటపెట్టలేదు. మరోవైపు ఈ ఏడాది రణ్​బీర్​ కాస్త బిజీ అయిపోయారనే చెప్పాలి. లవ్​ రంజన్​తో పాటు సందీప్​ రెడ్డి వంగాతో రణ్​బీర్​ సినిమాలు చేస్తున్నారు. ఆలియా సైతం కరణ్​జోహార్​ సినిమా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'తో బిజీ అయిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.