దర్శకుడితో మనస్పర్థలు.. రజనీ సినిమా ఛాన్స్​ వదులుకున్న హీరోయిన్​!

author img

By

Published : Sep 19, 2022, 4:56 PM IST

priyanka mohan rajnikanth

హీరోయిన్​ ప్రియాంక మోహన్​కు.. రజనీకాంత్ సినిమాలో నటించే ఛాన్స్​ మిస్​ చేసుకుందని తెలుస్తోంది. ఆ మూవీ దర్శకుడితో మనస్పర్థలు రావడమే కారణమని సమాచారం.

'గ్యాంగ్​లీడర్'​ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. ఈ మూవీ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

అదేంటంటే.. దర్శకుడు నెల్సన్ దిలీప్​-ప్రియాంక మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ డాక్టర్ సినిమాలో ఆమె హీరోయిన్​గా నటించింది. ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్​. దీంతో సూపర్​ స్టార్​ రజనీకాంత్​ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయిందని ప్రచారం సాగుతోంది.

నెల్సన్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న చిత్రం 'జైలర్'. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా నటిస్తోంది. అయితే తమన్నా కన్నా ముందే ఈ పాత్ర కోసం ప్రియాంకను అనుకున్నారట. కానీ నెల్సన్​తో జరిగిన ఓ చిన్న వివాదం వల్ల ప్రియాంక ఈ రోల్​కు నో చెప్పిందట. దీంతో తమన్నాను తీసుకున్నారని తెలిసింది. అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ సోషల్​మీడియాలో ఇలా వార్తలు వస్తున్నాయి.

ఇదీ చూడండి: రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.