RRR చిత్రానికి ప్రియాంక చోప్రా సాయం!​.. ఏం చేసిందో తెలుసా?

author img

By

Published : Jan 18, 2023, 6:56 PM IST

priyanka-chopra-small-contribution-to-rrr-movie

'ఆర్ఆర్ఆర్' చిత్రం పలువురు హాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటూ.. అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో వరుసగా అవార్డ్స్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే ఆస్కార్ నామినేషన్స్‌కు ఓట్ల కోసం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని యూఎస్‌లో పలు చోట్ల ప్రదర్శిస్తుండగా.. రీసెంట్ ప్రీమియర్‌లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తళుక్కుమంది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌తో పాటు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించింది.

దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం అంతర్జాతీయ వేదికగా పలువురు హాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో వరుసగా పలు విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంటోంది. అయితే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా 'ఆర్​ఆర్​ఆర్'​ దర్శకుడు ఎస్​ఎస్ రాజమౌళితో పాటు ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు​ గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిపై పొగడ్తల వర్షం కురిపించింది. 95వ అకాడమీ అవార్డ్స్‌ నామినేషన్ స్కోర్ పెంచుకునేందుకు 'ఆర్ఆర్ఆర్' బృందం.. ఆస్కార్ ఓటర్ల కోసం తమ సినిమాను ప్రచారం చేస్తుండగా తాజా ప్రదర్శనలో ప్రియాంక చోప్రా పాల్గొంది.

ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణితో దిగిన ఫొటోను ఆమె తన సోషల్​మీడియా హ్యాండిల్​లో షేర్ చేసింది. 'ఈ అత్యద్భుతమైన భారతీయ చలనచిత్ర ప్రయాణానికి నా వంతుగా సహకరించగలను' అని పోస్ట్ చేసింది. అంతేకాదు 'ఆర్ఆర్ఆర్' మూవీతో పాటు రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్​ చరణ్, ఆలియా భట్​, అజయ్ దేవ్‌గణ్​, ప్రేమ్ రక్షిత్, కీరవాణి, కాలభైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్​లను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేసింది.

ఇదిలా ఉంటే, ఆస్కార్స్‌లో నామినేషన్లు పొందేందుకు ఓటింగ్ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కాగా, అకాడమీ అవార్డు ప్రతిపాదనల పూర్తి జాబితా జనవరి 24న ప్రకటిస్తారు. తెలుగు చిత్రం 'ఆర్​ఆర్​ఆర్' లోని నాటు నాటు పాట​ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ రేసులో ఉంది. అలాగే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా సహాయ నటుడు విభాగాల్లో కూడా నామినేషన్లు పొందాలని 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ భావిస్తోంది.
ఇక నాటు నాటు సాంగ్ విషయానికొస్తే.. ఈ పాటను ఉక్రెయిన్‌లో 20 రోజుల పాటు చిత్రీకరించారు. అంతే కాదు 43 రీటేక్స్ తర్వాత ఫైనల్ వెర్షన్ ఓకే చేశారు దర్శకుడు రాజమౌళి. కీరవాణి స్వరపరిచిన ఆ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.