కల్యాణ్​రామ్​పై ఎన్టీఆర్​ ట్వీట్​.. అది ఇంకెవ్వరూ చేయలేరంటూ..

author img

By

Published : Aug 5, 2022, 4:36 PM IST

Updated : Aug 5, 2022, 4:45 PM IST

బింబిసార

కల్యాణ్​రామ్​పై ఆసక్తికర ట్వీట్​ చేశారు హీరో ఎన్టీఆర్​. ప్రస్తుతం ఇది సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్​ ఏంటంటే..

బింబిసార చిత్రంపై ప్రశంసలు ఎన్టీఆర్​ ప్రశంసలు కురిపించారు. 'బింబిసార' రాజు పాత్రకు తన సోదరుడు కల్యాణ్‌రామ్‌ తప్ప మరెవరూ సరైన న్యాయం చేయలేరని నటుడు ఎన్టీఆర్‌ అన్నారు. ప్రేక్షకుల నుంచి 'బింబిసార'కు వస్తోన్న స్పందనపై తాజాగా తారక్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాని తొలిసారి చూసినప్పుడు తామెలాంటి అనుభూతిని పొందామో.. ప్రేక్షకులూ అదే ఆనందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు.

ntr tweet
ఎన్టీఆర్​ ట్వీట్

"బింబిసార' సినిమా గురించి గొప్ప విషయాలు వింటున్నా. కల్యాణ్‌ రామ్ అన్నా.. ఈ సినిమాలో రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు. వశిష్ఠ.. తొలి ప్రయత్నంలోనే అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించావు. ఇక, ఈ చిత్రానికి కీరవాణి గారే వెన్నెముక. ఆయన అందించిన స్వరాలు అద్భుతంగా ఉన్నాయి" అని చిత్రబృందం మొత్తానికి ఎన్టీఆర్‌ అభినందనలు తెలిపారు. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రంలో కల్యాణ్‌రామ్‌ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించారు. సంయుక్తా మేనన్‌, కేథరిన్‌ కథానాయికలుగా అలరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : కమల్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. మళ్లీ సెట్స్​పైకి భారతీయుడు-2.. RC15 షూట్​కు బ్రేక్!

Last Updated :Aug 5, 2022, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.