'నాటు నాటు' రీక్రియేషన్.. ఈ సిస్టర్స్ స్టెప్పులకు యూట్యూబ్ ఫిదా!

author img

By

Published : Aug 2, 2022, 9:14 PM IST

NAATU NAATU SONG RECREATION

NAATU NAATU SONG RE-CREATION: 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాను ఊపేస్తున్నారు ఇద్దరు సిస్టర్స్. యూట్యూబ్​లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి.

ANKITA ANTARA NATU NATU: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్'. చిత్రం విడుదలై నాలుగు నెలలు పూర్తైనా దాని ప్రభావం ప్రేక్షకుల్లో ఇంకా ఉండిపోయింది. ముఖ్యంగా పాటల, యాక్షన్‌ సీన్లు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతున్నాయి. ఇక సోషల్​మీడియా చూస్తే అంతా ఈ మూవీ రీల్సే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా 'ఆర్‌ఆర్‌ఆర్‌' డైలాగ్​లు చెబుతూ, పాటలకు డ్యాన్స్​లు వేస్తూ అలరిస్తున్నారు. సినిమాపై తమకున్న అభిమానాన్ని తెలియజేస్తున్నారు.

ANKITA ANTARA SISTERS: ముఖ్యంగా 'నాటు నాటు' పాటైతే రికార్డు సృష్టిస్తోంది. కీరవాణి స్వరాలకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. అయితే దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత కవర్‌ సాంగ్స్‌తో, ఎడిటర్స్‌ తమ అభిమాన కథానాయకుల పాత సాంగ్స్‌తో 'నాటు'ను రీక్రియేట్‌ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ సృష్టిస్తున్నారు.

అయితే తాజాగా ఇద్దరు సిస్టర్స్ 'నాటు నాటు' పాటను పూర్తిగా రీక్రియేట్‌ చేశారు. వాళ్లే మ్యూజిక్‌ వాయిస్తూ, పాట పాడుతూ డాన్స్​ చేయడం విశేషం. 'నాటు నాటు' పాటకి అదిరిపోయేలా డాన్స్​ చేశారు. ఊరమాస్‌ డాన్సుకి, వారి ఎక్స్​ప్రెషన్స్​, పాట పాడే విధానం నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్​ నెట్టింట వైరల్‌ అవుతోంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. కాగా, ఈ సిస్టర్స్​ పేర్లు అంతరా నంది, అంకిత నంది. వీరు అంతకు ముందే మాషప్‌ స్కిట్లు, వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో పాపులారిటీ సాధించారు. అయితే వీరిద్దరు చూడ్డానికి ట్విన్స్​లా ఉండటం విశేషం.

కాగా, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటించారు. శ్రియ, అజయ్​దేవగణ్​ కీలక పాత్ర పోషించారు. మే 25న విడుదలై ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. రూ. 450 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు 1150 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోనే ఎక్కువ రోజులు నెంబర్‌ వన్‌ స్లాట్‌లో స్ట్రీమింగ్‌ అయిన చిత్రంగానూ రికార్డు క్రియేట్‌ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.