కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్​లో మెరవబోతున్న భారతీయ తారలు వీరే!

author img

By

Published : May 10, 2022, 10:53 PM IST

Cannes

కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్​లో భారతీయ సెలబ్రిటీలు మెరవబోతున్నారు. ఈ నెల 17వ తేదీన ఫెస్టివల్​లో కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ సహా పలువురు తారలు.. రెడ్​ కార్పెట్​పై నడవనున్నారు. ఈ క్రమంలో ఇందుకోసం ఆహ్వానించిన వారి జాబితాను విడుదల చేశారు.

Cannes film festival 2022: 75 వసంతాల వేళ.. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్​లో భారతీయ సెలబ్రిటీలు మెరవబోతున్నారు. దేశంలోని సుప్రసిద్ధ తారలు రెడ్​ కార్పెట్​పై తళుక్కుమనేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 17వ తేదీన ఫెస్టివల్​లో కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ సహా.. పలవురు నటీనటులు, సంగీత దర్శకులకు రెడ్​ కార్పెట్​పై నడిచే అవకాశం దక్కింది. హాజరయ్యే వారికి ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్​ రెహమాన్​, బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​ కుమార్​తో పాటు కేటగిరీల వారీగా.. ఫెస్టివల్​కు ఆహ్వానం లభించింది. ఆహ్వానితుల జాబితా ఇలా ఉంది..

Anurag
అనురాగ్​
  • అక్షయ్​ కుమార్​( నటుడు, నిర్మాత- బాలీవుడ్​)
  • ఏఆర్​ రెహమాన్​ ( అంతర్జాతీయ మ్యూజిక్​ కంపోజర్​)
  • మామే ఖాన్​ ( ఫోక్​ మ్యూజిక్​ కంపోజర్​, సింగర్​)
  • నవాజుద్దీన్ సిద్ధిఖీ ( నటుడు, బాలీవుడ్​)
  • నయనతార ( తమిళం, మలయాళం- హీరోయిన్​)
    nayan
    నయనతార
  • పూజా హెగ్డే ( హిందీ, తెలుగు- హీరోయిన్​)
    Pooja Hegde
    పూజా హెగ్డే
  • ప్రసూన్​ జోషీ( ఛైర్మన్​, సీబీఎఫ్​సీ)
  • మాధవన్​( నటుడు, నిర్మాత).. మాధవన్​ నటించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌' సినిమాను కేన్స్​ వేదికపై ప్రదర్శించనున్నారు.
  • రిక్కీ కేజ్​ ( మ్యూజిక్​ కంపోజర్​ )
  • శేఖర్​ కపూర్​ ( దర్శకుడు)
  • తమన్నా( తెలుగు, హిందీ, తమిళం- హీరోయిన్​)

ఇదీ చదవండి: 'సలార్​ అప్డేట్​ ఎప్పుడు?' సూసైడ్​ నోట్​లో ప్రభాస్​ అభిమాని​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.