మెగాస్టార్ ఆచార్య ట్రైలర్​.. బాలీవుడ్​లోకి తేజ.. 'సలార్' సర్​ప్రైజ్

author img

By

Published : Apr 9, 2022, 5:02 PM IST

Updated : Apr 9, 2022, 5:18 PM IST

Megastar Acharya

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య ట్రైలర్ అప్డేట్​ వచ్చేసింది. అలాగే దర్శకుడిగా తొలిసారి హిందీలో మెగా ఫోన్​ పట్టుకోబోతున్నారు తేజ.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆచార్య ట్రైలర్ విడుదలకు సంబంధించి అప్డేట్​ను చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల 12న సినిమా ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

Megastar Acharya
మెగాస్టార్ ఆచార్య

హిందీలోకి తేజ: తన సినిమాలతో ఎంతోమంది కొత్తవారిని టాలీవుడ్​కు పరిచయం చేసిన తేజ.. తొలిసారి ఆయన బాలీవుడ్​లో దర్శకత్వం వహించబోతున్నారు. కెమెరామెన్​గా ఇప్పటికే హిందీలో చాలా సినిమాలు తేజ.. దర్శకుడిగా మాత్రం మొదటిసారి బాలీవుడ్​లోని అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే రెండు హిందీ ప్రాజెక్ట్స్​కు తేజ ఓకే చెప్పారు. 'జఖామి' సినిమాతో పాటు.. 'తస్కరీ' అనే వెబ్​ సిరీస్​ను తెరకెక్కించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను ఎన్​హెచ్​ స్టూడియోస్​, ట్రిఫ్లిక్స్​ ఫ్లిల్మ్స్​ సంస్థలతో కలిసి.. టైమ్​ ఫ్లిల్మ్స్​ అనే నిర్మాణ సంస్థ నిర్మించనుంది.

Salaar Release Date Announcement: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న 'సలార్' సినిమా నుంచి.. ఆదివారం సర్​ప్రైజ్​ రానుంది. ఉదయం 11:15 గంటలకు సినిమాకు సంబంధించిన బిగ్​ అనౌన్స్​మెంట్​ చేయనున్నట్లు చిత్రం బృందం వెల్లడించింది. అయితే చిత్ర బృందం ఏం చేబుతుందా? అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. సలార్​ విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Last Updated :Apr 9, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.