'వాల్తేరు వీరయ్య' ఐటెం సాంగ్..​ దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్‌కు చిరు ఫిదా!

author img

By

Published : Nov 5, 2022, 10:46 PM IST

Waltair Veerayya Movie

మెగాస్టార్​ చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్​ కాంబో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. దాంతో వాల్తేరు వీరయ్య సినిమాకి కూడా డీఎస్పీకే సంగీతం బాధ్యతల్ని దర్శకుడు బాబీ అప్పగించారు. అయితే మూవీలో ఉన్న ఐటెం సాంగ్​కు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్‌కు చిరు ఫిదా అయ్యారట.

Waltair Veerayya Movie: మెగాస్టార్​ చిరంజీవి నటిస్తోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్‌ను అందించారట. బాబీ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీలో చిరంజీవికి జంటగా శ్రుతి హాసన్ నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి మాస్‌గా ఈ సినిమాలో కనిపించబోతున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్, టైటిల్ టీజర్‌ ద్వారా తెలుస్తోంది.

'వాల్తేరు వీరయ్య' సినిమాలో ఆరు పాటలు ఉండగా.. ఇందులో ఒకటి ఐటెం సాంగ్. ఆ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా డ్యాన్స్ చేయబోతున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఇంటస్ట్ర్‌తో ఈ సాంగ్‌కు మంచి ట్యూన్స్ అందించారని.. అవి విన్న చిరంజీవి ఇంప్రెస్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రవితేజ కూడా వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. ఆయన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు వినికిడి. అలాగే ఓ సాంగ్‌లో చిరంజీవి, రవితేజ ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేయబోతున్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి రిలీజ్‌ కాబోతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.