షూటింగ్ సమయంలో హీరో ఉపేంద్రకు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్
Updated on: Nov 24, 2022, 3:21 PM IST

షూటింగ్ సమయంలో హీరో ఉపేంద్రకు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్
Updated on: Nov 24, 2022, 3:21 PM IST
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ సినిమా షూటింగ్ సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
కన్నడంతోపాటు తెలుగులోనూ గుర్తింపు పొందిన రియల్ స్టార్ ఉపేంద్ర. విభిన్న కథలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆయన తాజాగా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రిలో జాయిన్ చేసినట్లు కన్నడ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. షూటింగ్ సమయంలో శ్వాస కోసం సంబంధిత సమస్యతో ఇబ్బంది పడటం వల్ల హాస్పిటల్‌కు వెళ్లినట్లు ఆ కథనాల్లో ఉంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, ప్రస్తుతం ఉపేంద్ర బుద్దివంత 2, త్రిశూలం, కబ్జా సహా మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ శరేవగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాగా, ఓంకారం, ఒకేమాట, రా, రక్తకన్నీరు, సన్ ఆఫ్ సత్యమూర్తి, గని సహా తదితర చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి: కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేయనున్న నాగ్.. మలయాళ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్!
