ఆస్కార్ స్టేజ్​పై భారత మహిళా విజేతకు చేదు అనుభవం

author img

By

Published : Mar 17, 2023, 4:56 PM IST

Updated : Mar 17, 2023, 5:15 PM IST

Etv Bharat

ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవంలో నాటు నాటు సాంగ్​కు, ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌కు పురస్కారాలు దక్కాయి. అయితే ఇలాంటి సమయంలో అకాడమీ చేసిన ఓ చర్య పట్ల భారత సినీ ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?

ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌గా నాటు నాటుకు, బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిలిమ్​గా ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌కు ఆస్కార్‌ పురస్కారాలు వరించాయి. దీంతో భారతీయ సినీ ప్రేక్షకాభిమానులు అందరూ సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో అకాడమీ చేసిన ఓ చర్యకు సినీ ప్రియులు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం సరికాదని అంటున్నారు. ఆస్కార్‌ దక్కించుకున్న ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ నిర్మాతను అకాడమీ అలా చేయడం కరెక్ట్​ కాదని ఫ్యాన్స్​ మండిపడుతున్నారు. అలాగే ఆమె కూడా అకాడమీ చేసిన చర్యకు అసహనం వ్యక్తం చేసింది.

అసలేం జరిగిందంటే.. సాధారణంగా ఆస్కార్​ అందుకున్న తర్వాత 45 సెకన్లు మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికీ ఛాన్స్​ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అంతకు మించి ఎక్కువ సమయం తీసుకుని మాట్లాడితే వెంటనే ఆ స్పీచ్‌ను కట్‌ చేసి మ్యూజిక్ ప్లే చేస్తారు. అయితే ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌కు అవార్డు ప్రకటించిన అనంతరం డైరెక్టర్‌ కార్తీకి తనకిచ్చిన సమయంలోనే స్పీచ్‌ను ముగించారు. కానీ నిర్మాత గునీత్‌ మోంగా.. మాట్లాడటం ప్రారంభించకముందే సంగీతం ప్లే చేశారు. దీంతో ఆమె.. తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే వెనుదిరిగారు.

Guneet Monga on Oscar moment
గునీత్‌ మోంగా
Guneet Monga on Oscar moment
గునీత్‌ మోంగా

ఇకపోతే అకాడమీ అందరి విషయంలోనూ ఇలానే వ్యవహరించిందా అంటే అదీ కాదూ.. వీరి తర్వాత బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ పురస్కారాలను అందుకున్న చార్లెస్‌ మాక్సీ, మాథ్యూ ఫ్రాడ్‌లు ఇద్దరూ 45 సెకన్ల కన్నా కాస్త ఎక్కువసేపే మాట్లాడినా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో నెటిజన్లు.. అకాడమీ భారత్‌ను ఇన్​సల్ట్​ చేసిందంటూ సోషల్​మీడియా వేదికగా ఫైర్​ అవుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై నిర్మాత గునీత్‌ మోంగా కూడా స్పందించారు.

"ఆస్కార్‌ వేదికపై నన్ను మాట్లాడనివ్వలేదు. ఇది నన్ను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే ఇండియన్​ ఇండస్ట్రీలో రూపొందిన ఓ షార్ట్‌ ఫిలిమ్​కు ఆస్కార్‌ రావడం ఇదే తొలిసారి అని సగర్వంగా చెప్పాలనుకున్నా. కానీ నన్ను అస్సలు మాట్లాడనివ్వలేదు. ఇంత దూరం వచ్చి నాకు మాట్లాడే అవకాశం రాలేదని చాలా బాధేసింది. దీనిపై సినీ ప్రియులు కూడా విచారం వ్యక్తం చేశారు. గొప్ప క్షణాలను ఇచ్చినట్లే ఇచ్చి నా దగ్గరి నుంచి లాక్కున్నట్లు అనిపించింది. భారత్​కు వచ్చాక నా ఆలోచనలు, సంతోషాన్ని తెలియజేస్తున్నాను. నాకు దక్కుతున్న ప్రేమను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది" అని తెలియజేశారు.

ఇదీ చూడండి: PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా ఎలా ఉందంటే?

Last Updated :Mar 17, 2023, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.