అయ్యో.. అనుపమకు సూపర్​ ఛాన్స్​ మిస్.. ఆ ఆఫర్​తో మరో హీరోయిన్​ స్టార్ స్టేటస్​ డబుల్​!

author img

By

Published : Dec 20, 2022, 3:27 PM IST

director sukumar about rangastalam heroine character

హీరోయిన్​ అనుపమకు సూపర్ ఛాన్స్​ మిస్​ అయింది. ఆ అవకాశాన్ని అందుకున్న మరో ముద్దుగుమ్మ​.. ఆ ఛాన్స్​తో మరింత స్టార్​ స్టేటస్​ను అందుకుంది. ఆ సంగతులు..

'రంగస్థలం'.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్​-రామ్​చరణ్​ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. నటన పరంగా చరణ్​ను ఓ మెట్టు ఎక్కించింది. ఈ చిత్రంలో అతడు పోషించిన చిట్టిబాబు పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో చిట్టిబాబుతో పాటు నటన పరంగా అనసూయ, సమంత కూడా తన పాత్రలతో విశేష ఆదరణను అందుకున్నారు.

అయితే అసలు విషయానికొస్తే.. సినిమా విడుదలయ్యే వరకూ కొన్ని విషయాలను దాచి పెడుతుంటారు దర్శకులు, నటులు. డైరెక్టర్​ సుకుమార్ కూడా రంగస్థలం మూవీ గురించి ఇప్పటివరకు అదే చేసి.. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఈ చిత్రంలో సమంత.. రామలక్ష్మీ రోల్​ను పోషించింది​. ఈ పాత్రలో సామ్​ను.. పల్లెటూరి అమ్మాయి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు సుకుమార్​. అలానే సామ్​ కూడా ఆ క్యారెక్టర్​లో ఇట్టే ఒదిగిపోయి నటించింది. పెళ్లి తర్వాత తనకొచ్చిన ఈ ఆఫర్​ను ఎంతో సునాయాసంగా చక్కగా చేసి అందరి చేత శభాష్​​ అనిపించుకుంది. అయితే ఈ ఆఫర్​ సామ్​ కంటే ముందు మరో ముద్దుగుమ్మను వరించిందట. కానీ ఆమెను కాదనుకున్న దర్శకుడు ఆ ఛాన్స్ సమంతకు ఇచ్చారట. ఇంతకీ​ ఆమె ఎవరో కాదు మన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్​. అసలు సుక్కు అనుపమను ఎందుకు వద్దన్నారంటే..

తాజాగా నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్​ నటించిన 18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముఖ్య సుకుమార్​ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ ఈ విషయాన్ని బయటపెట్టారు. "రంగస్థలానికి మొదట అనుపమను ఎంపిక చేసి ఆడిషన్స్​కు పిలిచాము..అయితే ఆడిషన్స్ జరుగుతున్నంత సేపు అనుపమ భయంతో తన తల్లి వంక చూస్తూ ఉండేది. ఈ విషయాన్ని గమనించి ​నేను భయపడి ఆమె స్థానంలో సమంతను ఎంపిక చేశాను" అని తెలిపారు. అయితే అనుపమ ఓ గొప్ప నటి అని కచ్చితంగా తనతో ఓ సినిమా తీస్తానని సుకుమార్​ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.